కూరగాయలు కట్ చేసే కత్తిని ఎలా వాడాలో తెలియకపోతే వచ్చే నష్టాలు తెలుసుకోండి.

-

కిచెన్ లో కూరగాయలు కట్ చేసే కత్తితో అన్నింటినీ కత్తిరించలేం. ఉల్లిగడ్డలు కోయడానికి సెపరేట్ కత్తి, పచ్చిమిర్చి తరగడానికి సెపరేట్ కత్తి, చేప, మాంసం వంటి వాటిని కోయడానికి సెపరేట్, పండ్లని వివిధ రకాలుగా కోయడానికి వివిధ రకాలైన కత్తులని వాడుతుంటారు. మనం ఎలా కోస్తున్నామనేది మనం వాడుతున్న కత్తి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే కత్తుల సెటప్ కిచెన్లో తప్పకుండా ఉండాల్సిందే. ఐతే కత్తులని వాడేటపుడు చేసే కొన్ని పొరపాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

కట్ చేసిన కత్తిని తుడిచి పక్కన పెట్టండి

కూరగాయని గానీ, మాంసాన్ని గానీ కోసినపుడు కత్తి నుండి ఆ పదార్థాన్ని తుడిచేయాలి. లేదంటే హానికరమైన బాక్టీరియా పెరుగుతుంది. అప్పుడు మరలా కత్తిని వాడినపుడు ఆ బాక్టీరియా మన శరీరంలోకి వెళ్తుంది. అమెరికాలో జరిపిన పరిశోధన ప్రకారం ఈ కోలి అనే బాక్టీరియా పెరగడానికి అవకాశం ఉందట. అందుకే కత్తిని వాడిన తర్వాత తీసి పక్కన పెట్టడమే మంచిది.

శుభ్రంగా కడగాలి

కత్తితో పై పూర్తికాగానే శుభ్రంగా కడగాలి. బ్లీచింగ్ పౌడర్ తో గానీ, డిష్ వాషర్ తో గానీ కడగవద్దు. దీనివల్ల తుప్పు పెరిగి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. కత్తిని కడిగిన వెంటనే టవల్ తో తుడవాలి. కత్తి నుండి నీళ్ళూ, తేమ పూర్తిగా కోల్పోయి ఎండిపోయిన తర్వాతనే పక్కన పెట్టాలి.

కత్తులని ఇతర వాటితో పెట్టవద్దు.

ఇతర పాత్రలతో పాటు కత్తులని కడిగి వాటిని కూడా అందులోనే ఉంచవద్దు. దానివల్ల పదునైన కత్తి మొనలకి రాపిడి జరిగి పదును కోల్పోతాయి. దానివల్ల తొందరగా పాడవుతాయి.

చాపింగ్ బోర్డ్ తప్పకుండా వాడాలి

కత్తితో ఏది కట్ చేసినపుడైనా చాపింగ్ బోర్డ్ వాడడం తప్పనిసరి. లేదంటే మిమ్మల్ని మీరు కోసుకునే ప్రమాదం ఉంది. చాపింగ్ బోర్డ్ మీద కత్తిరిస్తే కత్తి ఎక్కువ కాలం మన్నుతుంది. ముఖ్యంగా మాంసం కట్ చేస్తున్నప్పుడు కలపతో చేసిన చాపింగ్ బోర్డులని వాడడం ఉత్తమం. దీనివల్ల హానికరమైన బాక్టీరియా శరీరంలో వెళ్ళదు.

Read more RELATED
Recommended to you

Latest news