వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని వానా కాలంలో వీలైనంత వరకు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. వానా కాలంలో ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. వానా కాలంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వలన క్రిములు సులభంగా వ్యాధులని వ్యాపింప చేస్తాయి. అందుకని వానాకాలంలో కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ చిట్కాలని వానా కాలంలో కనుక పాటించారంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు.
వానా కాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా పర్సనల్ హైజిన్ చాలా ముఖ్యం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు చేరకుండా ఉంటాయి. రెగ్యులర్ గా చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం.. ముఖ్యంగా వానలో తడిసిన తర్వాత శుభ్రంగా స్నానం చేయడం చేతులు కాళ్ళని కడుక్కోవడం చాలా అవసరం. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు. వాన కాలంలో కంఫర్ట్ గా ఉండే దుస్తులను వేసుకోవాలి.
గాలి తగిలేవి లూస్ గా ఉండేవి వేసుకుంటే గాలి బాగా ఆడుతుంది. చర్మానికి గాలి తగులుతుంది. అప్పుడు ఫంగస్ ఇన్ఫెక్షన్ వంటివి ఏమీ కూడా రావు. యాంటీ ఫంగల్ పౌడర్స్ ని ఉపయోగిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు. చెమట ఎక్కువ పట్టే చోట మీరు నివసిస్తున్నట్లయితే కచ్చితంగా యాంటీ ఫంగల్ పౌడర్ ని ఉపయోగించండి అలానే వానలో తడిసిన తర్వాత పొడిగా మీ చర్మాన్ని ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి సరిపడా నీళ్లు తీసుకుంటే అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు.