తెలంగాణ బిజేపి అధ్యక్షుడుగా కిషన్ రెడ్డిని నియమించిన…అసలు రాజకీయం చేసేది ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించబడ్డ ఈటల రాజేందర్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయనదే కీలక పాత్ర అవుతుందని, ఓ వైపు చేరికలు…మరోవైపు రాజకీయంగా బిజేపిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఈటల చూసుకోవాలని అంటున్నారు. ఎలాగో కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఉంది..అంటే ఆ బాధ్యతలు కూడా చూసుకోవాలి..ఇటు బిజేపి అధ్యక్షుడుగా చేయాలి.
అంటే రాజకీయంగా కిషన్ రెడ్డికి అనుకున్న మేర పనిచేయడం తక్కువే. అందుకే పోలిటికల్ వ్యూహాలు ఈటల వేయాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఈటలకు..హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలవడమే కాకుండా రాష్ట్రంలో కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. ఇక కేసీఆర్‌తో సుమారు 20 ఏళ్లపాటు కలిసి పనిచేశారు. దీంతో కేసిఆర్ బలం ఏంటి, ఆయన బలహీనత ఏంటి అనేది ఈటలకు అవగాహన ఉంటుంది.
అలాగే బిఆర్‌ఎస్ పార్టీలో ఉండే లోపాలు కూడా ఆయనకు తెలుసు. అదేవిధంగా ఇంకా చాలామంది బిఆర్‌ఎస్ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో కొందరిని బిజేపిలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈటలకు రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిస్తితులపై అవగాహన ఉంది. పలు స్థానాల్లో బలాబలాలు ఆయనకు తెలుసు..అభ్యర్ధుల ఎంపిక విషయంలో కీలక పాత్ర పోషించవచ్చు. ఎన్నికల మేనిఫెస్టో విషయంలో కూడా ఈటలదే కీలక పాత్ర అయ్యే ఛాన్స్ ఉంది.
ఇలా అన్నీ రకాలుగా బిజేపిలో ఈటలది కీలకపాత్ర అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. ఇటీవల బిజేపి వెనుకబడింది. ఈటల పార్టీ మారతారని ప్రచారం ఉంది. ఆయన పార్టీ మారకుండా ఉండటానికే ఈ పదవి ఇచ్చారనే టాక్ ఉంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈటల రాజకీయం ఎలా ఉంటుందో?