చాలామందికి ఎక్కిళ్లు తరుచుగా వస్తుంటాయి. కొందరికి ఒక్కసారి ఎక్కిళ్లు వచ్చాయంటే ఆ రోజంతా పదేపదే ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటాయి. వీటికి కారణం ఛాతి అడుగున ఉంటే డయాఫ్రమ్ అసంకల్పితంగా స్పందించటం. ఇలా జరగటానికి కారణాలు ఉన్నాయండోయ్.. ఎక్కిల్లు వస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అబ్బా ఏం చేయాలో మాకు తెలియదా…వాటర్ తాగితే సరిపోతుంది అనుకుంటున్నారా..కొన్నిసార్లు ఎంత వాటర్ తాగినా ఎక్కిల్లు తగ్గవ్.మరి అప్పుడు ఏం చేస్తారు..ఇప్పుడు చూద్దాం.
శ్వాసను ఆపుకోవడం వల్ల..
ఎక్కిళ్ళను తగ్గించేందుకు ఉపయోగపడే అత్యంత ఈసీ వే శ్వాసను కాసేపు నొక్కిపెట్టకుని ఉండడం. అంటే ముందుగానే ఎక్కువగా గాలి పీల్చుకొని ఉంచుకోవాలి. అప్పడు ముక్కును, నోటిని బలవంతంగా నొక్కి పట్టుకోవాలి. ఇలా శ్వాసని కంట్రోల్ చేయడం ద్వారా ఉపిరితిత్తుల్లో కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల డయాఫ్రమ్ రిలాక్స్ అవుతుంది. తద్వారా ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఎక్కిళ్లు తగ్గేవరకూ ఇలా చేస్తూనే ఉండండి. అలా అని వెంట వెంటనే చేయకూడదు. కాస్తా సమయం మధ్యలో తీసుకుంటూ చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.
చల్లని నీరు తాగితే..
చల్లటి నీళ్లను కొంచెం కొంచెం సిప్ చేస్తే ఎక్కిళ్ల సమస్య తగ్గించుకోవచ్చు. ఇది ఎంతో చాలా సులభమైన పద్ధతి. చల్లటి నీళ్లను నొట్లో పుక్కిలించడం ద్వారా కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. ఎక్కిళ్లు ఎక్కువగా ఇబ్బంది పెడితే నీటిని తాగమని చెబుతుంటారు. అయితే, ఈ నీరు కూడా మామూలు నీరు కంటే చల్లని నీరు తాగితే సమస్య త్వరగా తగ్గుతుంది.
నీరు, తేనె కలిపి..
తేనె తీసుకోవడం ద్వారా కూడా ఎక్కిళ్ళ బాధను తగ్గించుకోవచ్చు. టీస్పూన్ తేనెని గోరువెచ్చని నీళ్లలో కలిపి, ఆ మిశ్రమాన్ని తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే, చల్లని నీటికి కాసింత తేనెని కలిపి ఆ నీటిని ముందుగా పుకిలించండి.. ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి.
ఐస్ ముక్కలు కూడా..
ఎక్కిళ్లకు ఐస్ క్యూబ్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఎక్కిళ్లు తగ్గాలంటే.. ఓ చిన్న ఐస్ క్యూబ్‌ని నోటిలో పెట్టుకుని నోటితో ఆ నీటిని పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయట.
పంచదారతో కూడానా..
ప్రతీ ఇంట్లో పంచదార పక్కా ఉంటుంది. ఓ చెంచా చక్కెరను తీసుకుని నోట్లో వేసుకోవాలి. వేసుకున్న వెంటనే నమలకుండా.. నోట్లోనే ఎక్కువ సేపు ఉంచుకోవాలి. మెల్లిగా అందులోనుంచి వచ్చే రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి. పంచదార తినడం వల్ల వేగస్ నరం ఉత్తేజానికి గురవుతుంది. ఇలా చేయడం వల్ల మీ మెదడుని ఎక్కిళ్ల గురించి మరిచిపోయేలా చేస్తుంది. మెదడుకు, కడుపుకు కనెక్ట్ అయి ఉన్న నరం పై చక్కర ప్రభావం చూపుతుంది… కాబట్టి ఈ చిట్కా బాగా పని చేస్తుంది.
నిమ్మాకాయతో ఇలా చేయండి..
నిమ్మ రుచి నరాలను ప్రభావితం చేస్తుంది. దీంతో సమస్య త్వరగా తగ్గుతుంది. ఇందుకోసం ఓ చెంచా నిమ్మరసం తీసుకోవాలి. ఈ రసాన్ని అలానే మింగండి.. ఇలానే కాకుండా నిమ్మ ముక్కపై ఉప్పు వేసి ఆ రసాన్ని పీల్చుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి.
మోకాలపైకి ఛాతిని లాగి అలా కాసేపు ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత దాన్ని వదిలివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల డయాఫ్రమ్ మీద పడిన ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ఇదండి మ్యాటర్..ఇది చదివాక..అబ్బా ఒక్కసారి ఎక్కిళ్లు వస్తే బాగుండు..వీటిలో ఏదైనా ట్రై చేసి చూద్దాం అనే క్రీజీ థాట్ మీకు కూడా వచ్చిందా.. ఫస్ట్ ఎక్కిల్లు రాకుండా ఉండాలంటే వేగంగా తినే అలవాటు మానేయండి.