ఎక్కువగా పంచదారను ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ వుంటాయి. అందుకనే పంచదారను తగ్గిస్తూ ఉండాలి. పంచదారకు బదులుగా మనం బెల్లం లేదా ఇతర పదార్దాలను వాడుతూ ఉండచ్చు. దాని వలన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. మీరు కూడా పంచదారను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు అయితే తగ్గించడం మంచిది.
చాలామంది కాఫీ, టీలలో కూడా షుగర్ ని ఎక్కువ వేసుకు తీసుకుంటూ వుంటారు. అయితే టీలో ఎక్కువ షుగర్ ని తీసుకునే వాళ్ళు టీ లో పంచదారకు బదులుగా ములేతి ని ఉపయోగిస్తే మంచిది. ఆయుర్వేద వైద్యం లో ఉపయోగించే ములేతి వలన ఎన్నో లాభాలు వున్నాయి. ఇందులో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి మరి అవేమిటో చూద్దాం.
ములేతి వలన కలిగే లాభాలు:
ములేతి లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గట్ కి సంబంధించిన సమస్యలు మాయం అవుతాయి.
అలానే అల్సర్, రెస్పిరేటరీ సమస్యలను కూడా మనం తొలగించుకోవచ్చు.
బ్యాక్టీరియా సమస్యలను కూడా ఇది తొలగిస్తుంది.
జలుబు, దగ్గు ఇబ్బంది కూడా పోతుంది.
అయితే ములేతి మంచిదని అధికంగా తీసుకోకూడదు. ఏదైనా ఆహార పదార్థాలను అధికంగా తీసుకుంటే కూడా సమస్యలు వస్తాయి. ఇక ఎంత ములేతి ని తీసుకోవచ్చు అనేది కూడా తెలుసుకుందాం. గైడ్లైన్స్ ప్రకారం చూస్తే… ఒకటి నుండి ఐదు గ్రాముల ములేతిని రోజూ తీసుకోవచ్చు. ఒక గ్రాము కంటే తక్కువ తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్స్ వుండవు.