హాయిగా నిద్రపోవాలంటే ఈ ఒక్కటి చాలంటున్న డాక్టర్..

Join Our Community
follow manalokam on social media

నిద్రపోవడం అనేది చాలా మందికి పెద్ద సమస్య. సరైన సమయానికి నిద్రరావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నిద్రరాక సతమతమవుతుంటారు. మన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగానే నిద్రపోవడం అనేది ఇబ్బందిగా మారింది. అనవసర టెన్షన్లు, ఒత్తిళ్ళు, రాత్రిపూట పనిచేయడాలు మొదలైనవి జీవన చక్రాన్ని మారుస్తున్నాయి. దానివల్ల మన శరీరానికి అలవాటు తప్పిపోతుంది. అందుకే ఏది ఏ టైమ్ లో చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటుంది.

ఐతే నిద్రకోసం కొన్ని రకాల టిప్స్ పాటించమని చాలా మంది చెబుతుంటారు. అలాంటి ఒక టిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకానొక డాక్టర్ తెలిపిన ఈ టిప్ నిద్ర పట్టడానికి బాగా ఉపయోగపడుతుందని వినిపిస్తుంది. దీనికోసం మీరేమీ పెద్దగా కష్టపడనక్కరలేదు. ఏవేవో ఆహారాలు, వ్యాయామాలు చేయనక్కరలేదు. కానీ ఒక జత సాక్స్ ఎక్స్ ట్రా కొనుక్కుంటే సరిపోతుంది. ఏంటీ? నిద్రపోవడానికి సాక్సులకి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అదే మరి కిటుకు.

నిద్రపోయే ముందు కాళ్ళకి సాక్సులు వేసుకుంటే హాయిగా నిద్రపడుతుందట. సాక్సుల వల్ల అరికాళ్ళలో వెచ్చదనం పుట్టి, నిద్రలోకి జారుకునేలా చేస్తాయని డాక్టర్ చెబుతున్నాడు. దీనివల్ల నిద్ర తొందరగా వస్తుందని, ఈ టిప్ ని తాను ఒకానొక సర్వే నుండి కనుగొన్నానని తెలిపాడు. ఈ విషయమై కొందరు నెగెటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. సాక్సులు వేసుకుని నిద్రపోతే దాని వాసనకి నిద్ర దూరమవుతుందే కానీ నిద్రపోవడం అసంభవమని అంటున్నారు. మరికొందరేమో అది నిజమే అని సాక్సుల వల్ల నిద్ర తొందరగా పడుతుందని, మేము కూడా అలా ట్రై చేసామని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలుసుకోవాలనుందా? ఐతే మీరూ ట్రై చేయండి.

TOP STORIES

నమ్మండి.. ఈ ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదు

పర్యావరణానికి హాని చేయని ప్లాస్టిక్‌ కవర్లను చూశారా? ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదా! అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమేనండి. మనం వాడి పడేసిన కవర్లు...