షుగర్‌ ఉన్నవారికి భుజం ఎందుకు గట్టిగా అవుతుంది..?

డయబెటిక్‌ పేషెంట్స్‌కు బాడీ పెయిన్స్‌ రావడం సహజం. అయితే వాళ్లకు ఎక్కువగా భుజం చుట్టూ వచ్చే నొప్పి, కీళ్ల నొప్పి ఉంటుంది. భుజం అనేది గట్టిగా మారడాన్ని ఫ్రోజెన్ ష్టోల్డర్ అని అంటారు. భుజం కీలు చుట్టూ ఉన్న కణజాలం వాపు, గట్టిగా మారినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు భుజాన్ని కదిలించలేరు. వాపుగా కూడా ఉంటుంది.భుజం గట్టిగా మారడం.. భుజాలు ఎముకలు, లిగమెంట్స్, లిగమెంట్స్ బంధన కణజాల గుళికలతో చుట్టబడి ఉంటాయి. భుజం కీలు చుట్టూ క్యాప్సూల్స్ చిక్కగా, బిగుతుగా ఉన్నప్పుడు అది కదలికలకి ఇబ్బందిగా మారుతుంది. ఈ పరిస్థితి సాధారణంగా మూడు స్టేజెస్‌లో ఉంటుంది. అవేంటి, చికిత్స ఎలానో ఈరోజు తెలుసుకుందాం..

గడ్డకట్టే దశ..

ఇది ఆరు నుంచి తొమ్మిది నెలల మధ్య ఉంటుంది. ఈ స్టేజ్‌లో మీ భుజాన్ని కదల్చడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. దీంతో మీరు చలన పరిధిని కోల్పోయినట్లుగా ఉంటారు.

గట్టిగా మారడం..

ఇది నాలుగు నుండి పన్నెండు నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ, గట్టిగా మారే కొద్ది భుజాన్ని కదపడం చాలా కష్టం అవుతుంది.

థావింగ్ స్టేజ్

ఈ స్టేజ్‌లో మీరు కాస్తా చేతిని కదల్చుతారు. లక్షణాలు ప్రారంభమైన ఆరు నెలల నుండి చాలా సంవత్సరాల వరకూ పనులను తిరిగి చేసుకోవచ్చు.

షుగర్ ఉన్నవారికి భుజం గట్టిగా అయ్యే సమస్య ఎక్కువగా వస్తుంది. షుగర్ కొల్లాజెన్‌తో కలిసినప్పుడు, అది జిగటగా మారుతుంది. కదలికలు లేకుండా చేస్తుంది. దీంతో మీ భుజం గట్టిపడుతుంది. ఈ సమయంలో మీరు పనిచేయాలనుకున్నప్పుడు నొప్పిగా ఉంటుంది.

ఈ జాగ్రత్తలు ముఖ్యం..

సాధ్యమైనంతవరకూ రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌ ఉండేలా చూసుకోండి.

రోజూ ఎక్సర్‌సైజ్ చేయండి.

నొప్పిని తగ్గించేందుకు డాక్టర్ సలహా మేరకు మందులు వాడొచ్చు.

ఫిజికల్ థెరపిస్ట్ సాయంతో భుజం బలంగా మారేందుకు కొన్ని స్రెచెస్ చేయొచ్చు.

మీరు ఏం చేయలేకపోతే సర్జరీ కూడా ఎంచుకోవచ్చు.

భుజానికి హ్యాండ్ బ్యాగ్స్ వేయడం ఆపేయండి. మీ చేతికి కాస్తా రెస్ట్ ఇవ్వండి.

దీనికి సంబంధించి సమస్య ఎక్కువైతే కొన్ని రకాల థెరపీల ద్వారా కూడా చికిత్స చేయొచ్చు. కాబట్టి భయం ఏం అక్కర్లా..కాకపోతే సమస్య రాకముందే కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం మంచిది.