గేదెపాలు కంటే..ఆవు పాలు ఎందుకు శ్రేష్టం.. వీటి మధ్య తేడాలు ఏంటి.. ?

-

పాలు తాగటం ఆరోగ్యానికి మంచిదని మన అందరికి తెలుసు. చిక్కటి పాలు తోడుపెట్టిన గెడ్డపెరుగు అంటే…మహా ఇష్టం కదా. పాలు అంటే..ఎవరైనా గేదెపాలనే ప్రిఫర్‌ చేస్తారు. కానీ నిజానికి గేదెపాలు కంటే..ఆవుపాలు మంచివి. కానీ ఆవుపాలు అందరికి నచ్చవు. బర్రె పాల కంటే ఆవు పాలే శరీరానికి ఎంతో శ్రేష్టం అని చెబుతున్నారు నిపుణులు. అసలు ఆవుపాలకి గేదె పాలకి తేడా ఏంటి. నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

ఆవు పాలు ఉపయోగాలు…

ఆవు పాల వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆవు పాలలో కొవ్వు శాతం చాలా తక్కువ. అధిక బరువును నియంత్రించడంలో ఈ పాలు చాలా సహాయపడతాయట. జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి. ఆవు పాలలో కాస్త కుంకుమ పువ్వును, చక్కెరను కలుపుకుని తాగితే పైల్స్ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

పిల్లల ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఆవు పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆవు పాలలో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ అధికంగా ఉండటంతో.. ఎముకల దృఢత్వానికి ఈ పాలు బాగా దోహదపడతాయి. కంటి సమస్యలు రాకుండా ఈ పాలు కాపాడతాయట. రోగనిరోధక శక్తిని పెంచడంలో దివ్యౌషధంగా పనిచేస్తాయి. మెదడు చురుకుదనానికి ఇది మంచి ఔషధం. ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో 10-11 శాతం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దాంతో… ఎక్కువ‌గా వేడి నిరోధ‌క‌త‌ను క‌లిగి ఉంటటుందని.. న‌వ‌జాత శిశువులు, వృద్ధుల‌కు బ‌ర్రె పాలు తాగించొద్ద‌ని చెబుతుంటారు.

ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఊబ‌కాయం, ర‌క్త‌పోటు, కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డేవారు ఆవు పాల‌కు బ‌దులు బ‌ర్రె పాలు తాగ‌డం మంచిది.

ఆవు పాల‌ల్లో 3-4 శాతం మాత్ర‌మే కొవ్వు ఉంటుంది. అదే బ‌ర్రె పాలల్లో అయితే.. 7-8 శాతం వ‌ర‌కు కొవ్వు ఉంటుంది.

ఆవు పాల కంటే బ‌ర్రె పాలు చిక్క‌గా ఉంటాయి. దీనివ‌ల్ల బ‌ర్రెపాలు అర‌గ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది.

ఆవుపాల‌తో పోలిస్తే బ‌ర్రె పాలల్లోనే కేల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. కేల‌రీల‌తో పాటు ప్రోటీన్లు, కొవ్వు అధికంగా ఉంటాయి
.
ఒక‌ గ్లాస్ బ‌ర్రె పాల‌ల్లో 237 కేల‌రీలు ఉంటే.. ఒక గ్లాస్ ఆవు పాల‌ల్లో 148 కేల‌రీలు మాత్ర‌మే ఉంటాయి.

బ‌ర్రె పాల‌ల్లో పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీ ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాలు ఎక్కువ స‌మ‌యం నిల్వ ఉంటాయి.

మంచి నిద్ర పోవాలంటే రాత్రి పూట బ‌ర్రె పాలు తాగ‌డం మంచిది.

కోవా, పెరుగు, నెయ్యి, ప‌న్నీర్‌, పాయ‌సం వంటివి చేయ‌డానికి బ‌ర్రె పాలు మంచివి.

అదే ఆవు పాలల్లో త‌క్కువ క్రీమ్ ఉంటుంది కాబ‌ట్టి స్వీట్ల తయారీకి వీటిని ఉపయోగిస్తారు .

ఆవు పాలు ప‌సుపు, తెలుపు రంగులో ఉంటాయి. బ‌ర్రె పాలు తెలుపు, క్రీమ్ క‌ల‌ర్‌లో ఉంటాయి.

బ‌ర్రె పాలల్లోని బీటాకెరోటిన్ రంగులేని విట‌మిన్ ఏగా మారుతుంది. అందుకే బ‌ర్రె పాల‌ల్లో ప‌సుపు రంగు పోతుంది. ఆవు పాలల్లో కూడా బీటాకెరోటిన్ ఉంటుంది. కానీ త‌క్కువ మోతాదులో మాత్ర‌మే ఉంటుంది.‌

ఆవు పాలు, బ‌ర్రె పాల మ‌ధ్య తేడా ఉన్న‌ప్ప‌టికీ ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. రెండింటిలోనూ పోష‌కాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే మ‌న అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఆవు పాలు కావాలా, బ‌ర్రె పాలు కావాలా అన్న‌ది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ బర్రెపాలు తాగి బోర్‌ కొడితే..అప్పడప్పుడూ ఆవుపాలు ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news