ఇలా యోగాతో కోపం, ఒత్తిడి దూరం..!

ఈ మధ్యకాలంలో ఒత్తిడి, కోపం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ మానసిక సమస్యలు దూరం చేసుకోవడానికి యోగ బాగా  ఉపయోగపడుతుంది. యోగాతో కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మనం పెంపొందించుకోవచ్చు.

అలానే యోగతో మనం చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ రోజు మనం మానసిక ఆరోగ్యం బాగుండాలన్నా, ఒత్తిడి కోపం వంటివి తగ్గాలన్నా ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాం. అయితే మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసమే పూర్తిగా చూసేయండి. ఆసనాలు మనని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మానసిక సమస్యలను ఈ ఆసనాలు దూరంచేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ఆ ఆసనాల గురించి ఇప్పుడు చూద్దాం.

వజ్రాసనం:

వజ్రాసనం వేయడం వల్ల ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే ఒత్తిడి, కోపం కూడా తగ్గుతాయి. కాబట్టి కాసేపు వజ్రాసనం వేసి చూడండి.

ధనురాసనం:

ధనురాసనం వల్ల కూడా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ధనురాసనం కూడా మీకు బాగా సహాయం చేస్తుంది.

చక్రాసనం:

చక్రాసనం ఒత్తిడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే రిలాక్స్ గా ఉంచుతుంది కాబట్టి దీనిని కూడా వేస్తే మంచిది.

మంచి నిద్ర కోసం ప్రాణాయామం:

మంచి నిద్ర వల్ల శారీరక సమస్యలు మరియు మానసిక సమస్యలు కూడా మీ నుండి దూరం అయిపోతాయి. అయితే మంచి నిద్ర పొందడానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఐదు నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తే మంచి నాణ్యమైన నిద్ర మీరు పొందొచ్చు. కనుక ఈ టిప్స్ ని ఫాలో అయ్యి మానసిక సమస్యలకు దూరంగా ఉండండి. దీనితో మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు.