మహమ్మారి సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆరోగ్య సూచనలు..

-

ఆరోగ్యం విషయానికి వస్తే మహిళల శరీరానికి, పురుషుల శరీరానికి చాలా తేడా ఉంటుంది. అందుకే ఆరోగ్య సమస్యల్లోనూ ఆ తేడాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా మహిళల శరీరం సున్నితమైనది. అందుకే సరైన పోషణ చాలా అవసరం. అదీగాక భారతీయ మహిళలు అటు ఇంటిపనులు చూసుకుంటూనే ఆఫీసు పనులూ చేస్తుంటారు. ఇంటి పనులు వారికి ఎప్పటి నుండో అలవాటు. అదనంగా ఆఫీసు పనులు చేయడం వల్ల ఎక్కువగా అలసిపోతుంటారు. ఇలాంటి టైమ్ లోనే వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన సూచనలు పాటిస్తే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను తొలగించుకోవచ్చు.

ప్రస్తుతం మహమ్మారి విజృంభిస్తుంది. ఈ టైమ్ లో మహిళలు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకుందాం.

విటమిన్ సి

రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి మహిళలకి చాలా అవసరం. దానికోసం సిట్రస్ ఫలాలను తినాల్సి ఉంటుంది. నిమ్మ, జామ, బత్తాయి, నారింజ మొదలగు ఫలాల్లో సి విటమిన్ అధిక మొత్తంలో లభిస్తుంది. దానివల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

ఆపిల్ కూడా చాలా మెరుగైనది. రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. అంతేకాదు చక్కెర శాతాన్ని నియంత్రించడంలో ఇది బాగా పనిచేస్తుంది.

కావాల్సినన్ని నీళ్ళు ఖచ్చితంగా తాగండి. ఇది సమ్మర్ కాబట్టి, శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేట్ చేస్తూ ఉండండి. లేదంతే నిర్జలీకరణానికి గురై అనేక సమస్యలు ఏర్పడతాయి.

శరీరంలో రక్తం శాతాన్ని పెంచడానికి ఆహారంలో దానిమ్మని తీసుకోండి. రక్తం తక్కువగా ఉండడం మొదలైన ఇబ్బందులని ఇది దూరం చేస్తుంది. రక్తహీనత నుండి కాపాడడంలో దానిమ్మ చాలా సాయపడుతుంది.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా వ్యాయామం చేయండి. ఏమీ తీసుకున్నా, ఏది తిన్నా వ్యాయామం చేయకపోతే అదంతా వృధా అవుతుంది. వ్యాయామం మీకు శక్తిని ఇవ్వడంతో పాటు వ్యాధుల బారి నుండి తట్టుకునే బలాన్ని ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news