ఈ ఆహారపదార్ధాలతో సులువుగా బరువు తగ్గచ్చు..!

బరువు తగ్గాలని చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. వీటిని తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు. మరి ఇక వాటి కోసం ఒక లుక్ వేసేయండి.

weight loss
weight loss

 

గ్రీన్ టీ :

గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. గ్రీన్ టీలో మెటబాలిజం బూస్టింగ్ కి మరియు క్యాన్సర్ ఫైటింగ్ కి సహాయపడుతుంది. అలాగే ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. క్యాలరీలు కరిగించుకోవడానికి గ్రీన్ టీ ఎంతో బాగా సహాయ పడుతుంది. కనుక రెగ్యులర్ గా గ్రీన్ టీ ని తీసుకొని బరువు తగ్గొచ్చు.

బ్లాక్ టీ :

బ్లాక్ టీ కూడా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అచ్చం గ్రీన్ టీలానే బ్లాక్ టీ కూడా ఉపయోగపడుతుంది. అయితే బ్లాక్ టీ కి గ్రీన్ టీ కి భేదం ఏమిటంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ మాత్రమే.

కూరగాయల రసం:

కూరగాయల రసం లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీట్రూట్, క్యారెట్, టమాటా మరియు ఆకుకూరలు జ్యూస్ తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు.

నట్స్:

ఆరోగ్యానికి చాలా మంచిది అయితే బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ప్రొటీన్లు, మినరల్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి ఇలా రెగ్యులర్ గా వీటిని కూడా తీసుకొని బరువు తగ్గొచ్చు అలాగే బ్లూబెర్రీస్ కూడా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని కూడా మీరు తీసుకోండి.