చలికాలంలో వచ్చే అనారోగ్యాల నుండి దూరంగా ఉండడానికి కావాల్సిన టిప్స్

-

వాతావరణం చల్లగా మారడంతో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందుకే చలికాలంలో జబ్బుల బారిన ఎక్కువగా పడుతుంటారు. ఐతే చలికాలంలో వచ్చే ఇబ్బందుల నుండి దూరంగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావాల్సినంత విటమిన్ డి..

చలికాలం బయటకు రావాలంటే ఇబ్బంది పడేవారు విటమిన్ డి కోసమైనా బయటకు రావాలి. కనీసం నిమిషాల పాటైనా సూర్యుని ఎండ పడేలా చూసుకోండి. దీనివల్ల ఎముకలు గట్టి పడడంతో పాటు కండరాల్లో కొత్త శక్తి వస్తుంది. అంతేకాదు పొద్దున్న పూట కొన్ని నిమిషాల పాటు ఎండలో నిల్చుంటే మూడ్ కూడా బాగుంటుంది.

డ్రెస్సింగ్

చలికాలం పూట ఉలెన్ బట్టలు ధరించడం మంచిది. చర్మానికి అతుక్కుపోయేలా ఉండే దుస్తులని ధరించకపోవడం ఉత్తమం. చర్మానికి బిగుతుగా ఉండే వాటివల్ల దురద వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

వ్యాయామం

వారానికి 150నిమిషాలైనా వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల రక్తపీడనం కంట్రోల్ లో ఉండడమే గాక, రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సమస్యలు అధికం. చర్మం పొడిబారిపోవడం, పెదవులు పగలడం వంటి సమస్యలు వస్తుంటాయి. వీటి నుండి బయటపడాలంటే కావాల్సినన్ని నీళ్ళు తాగాలి. అంతేకాదు ఎప్పటికప్పుడు చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి.

ఆహారం

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు, సిట్రస్ ఫలాలని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. తాజా కూరగాయలు, ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారాలని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరలు మొదలైనవి చాలా మేలుచేస్తాయి. పిజ్జామ్ పేస్ట్రీ వంటి వాటిని దూరం పెట్టండి.

Read more RELATED
Recommended to you

Latest news