ఈరోజు ఈ రాశివారికి తిరుగులేదు..అన్ని విజయాలే..

-

మేషం: కొత్త ఉద్యోగాలు సంపాదిస్తారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉపశమనం లభిస్తుంది..శుభవార్తలు వింటారు.

వృషభం:  కుటుంబంలో ఒత్తిళ్లు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.వ్యయప్రయాసలు. బంధువులు, స్నేహితులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్య సమస్యలు.

మిథునం: మానసిక అశాంతి. వ్యాపారులకు లాభాలు అనుమానమే. ఉద్యోగులకు పనిఒత్తిడులు. అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం:  సోదరులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు అనుకున్న హోదాలు సంపాదిస్తారు. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. కీలక సమాచారం రాగలదు.

సింహం:  ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగులకు పనిఒత్తిడులు.సన్నిహితులు, స్నేహితులతో విభేదాలు.ఈరోజు కొత్త పనులు వాయిదా వెయ్యడం మంచిది.

కన్య:  సమాజంలో గౌరవం పెరుగుతుంది. అందరిలోనూ గుర్తింపు రాగలదు. వాహనయోగం. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు.కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

తుల: కార్యక్రమాలలో వెనుకబాటు. ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారులు నిరాశ చెందుతారు. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

వృశ్చికం:  స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు ప్రోత్సాహం. ఉద్యోగులకు హోదాలు.రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖవ్యక్తులు పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు.దైవదర్శనాలు చేస్తారు.

ధనుస్సు: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతాలు. బంధువుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వస్తులాభాలు. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి..ఈరోజు మంచి రోజు..

మకరం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడుల్లో చిక్కులు. ఉద్యోగులు అదనపు విధులు చేపట్టాల్సి వస్తుంది.

కుంభం: ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి మాటపడతారు. కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు మార్పులు.మిత్రులతో గొడవలు,చేపట్టిన పనుల్లో ఆటంకాలు.

మీనం:  పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news