ఈ రాశుల అమ్మాయిలకు కోపం వస్తే భరించటం కష్టమే..!

-

అమ్మాయిలు అంటే…ఓర్పుకు ప్రతిబింబాలు, శాంతమూర్తులు అని అనుకుంటారు..కానీ వాళ్లకు కోపం వస్తే..ఇవేవి ఉండవు..మొత్తం ఆగం ఆగం చేసేస్తారు. అయితే కోపం అంత ఈజీగా రాదులేండి. అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతుంటేనే బాగుంటుంది. వారి నవ్వుతో…ఎదుటివారికి కూడా హూయిగా అనిపిస్తుంది. అయితే కోపం వస్తే..కొన్ని రాశుల అమ్మాయిలను తట్టుకోవడం చాలా కష్టమట.
జ్యోతిష శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలిక మనుషులను ప్రభావితం చేస్తాయి.. ఒక వ్యక్తి యొక్క రాశిచక్రంపై క్రూర, పాపపు గ్రహాల దృష్టి పడినప్పుడు వారు కోపంగా కనిపిస్తారు. పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతుంటారు. ఇలాంటి పరిస్థితి అమ్మాయిలకు ఎదురైనప్పుడు.. వారిని శాంతింపజేయడం కష్టం.
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఎవరైనా జాతకంలో చంద్రునిపై పాప గ్రహంకనిపిస్తే… అలాంటి అమ్మాయిల కోపం సప్తమ స్వర్గానికి చేరుకుంటుంది. కర్కాటక రాశి అమ్మాయిలు కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే వారికి కోపం వస్తే శాంతించడం చాలా కష్టం. ఈ రాశి అమ్మాయిలు కోపం కారణంగా ఎంతో నష్టపోతారు. అందుకే కోపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 సింహ రాశికి అధిపతి సూర్య దేవుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడిడి అన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. సమస్త గ్రహాలకు ఆయనే రాజు. సింహ రాశి గల అమ్మాయిలు రాణి లాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే.. వారికి చాలా త్వరగా కోపం వస్తుంది. శుభగ్రహాల స్థానం బలంగా లేకుంటే.. అలాంటి సింహ రాశి అమ్మాయిలు అహంకారంతో ఉంటారు. ఆ కోపంలో తమకు తామే హాని చేసుకుంటారు. వారు తమ శత్రువులను ఎప్పటికీ క్షమించరు. ఒక్కసారి కోపం వస్తే చాలా సేపు అలాగే ఉండిపోతారు. కూల్ అవడానికి చాలా టైం పడుతుంది.
ఇక ఆఖరిది.. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ గ్రహం యుద్ధానికి కారణమైనదిగా విశ్వసిస్తారు. వృశ్చిక రాశివారి జాతకంలో కుజుడు అశుభంగా ఉండి, రాహువు లేదా కేతువు ప్రభావం ఉన్నప్పుడు.. కోపం పెరుగుతుంది. ఈ పరిస్థితిలో వచ్చిన కోపాన్ని నియంత్రించడం చాలా కష్టం అవుతుంది. సాధారణంగా వృశ్చికరాశి అమ్మాయిలు అంత తేలికగా కోపం తెచ్చుకోరు. కానీ వస్తే మాత్రం.. వారిని ఆపడం ఎవరి తరం కాదు.
ఈ రాశుల్లో మీ రాశి ఉందా అమ్మాయిలు..అయినా ఏ రాశి వారికైనా..కోపం అంత మంచిది కాదు..దాని వల్ల మన మైండ్ కరాబ్ అవుతుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకే దారితీస్తాయి. ఎక్కువ కోపం తెచ్చుకోకుండా..ఏ సమస్యనైనా..కూల్ గా హ్యాండిల్ చేసే నైపుణ్యాన్ని మీరు సంపాదించుకుంటే చాలా బాగుంటుంది..కోపం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు..
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version