ఈరోజు ఈ రాశుల వారికి ఏ పని చేసినా లాభాలే.. లాభాలు..

-

జూన్ 8 బుధవారం రాశి ఫలాలు.. ఈరోజు ఆ రాశుల వారికి వస్తూ, ధన లాభాలు.. 

మేషం …కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తీ అవుతాయి.. ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం..ఈరోజు లాభాలు అధికంగా ఉంటాయి.

వృషభం..కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో తగాదాలు.. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయం కాస్త తగ్గుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగులకు ఒత్తిడులు..ఈరోజు మాట పట్టింపులకు పోవడం మంచిది కాదు.

మిథునం..కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు పనిభారం, మాటలు, దూర ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం ……కొత్త కార్యక్రమాలు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకూలం..ఈరోజు మంచి రోజు..

సింహం ….కొన్ని కార్యక్రమాలను హఠాత్తుగా విరమిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు కష్టమే.ఉద్యోగులకు పనిభారం.

కన్య ….ఆదాయం ఆశాజనకం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆశించిన కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు..కొత్త పనులు మొదలు పెట్టకపోవడమే మంచిది.

తుల …పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపారులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు ఒత్తిళ్లు..కుటుంబంలో చికాకులు..

వృశ్చికం ….ఈరొజు ఆదాయం పెరుగుతుంది. బంధువుల కలయిక. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది..వస్తూ లాభం అధికం.

ధనుస్సు ..కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అదనపు ఆదాయం. వ్యాపారులు మరింత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలస్థితి..పదోన్నతులు.

మకరం …ఆర్థిక సమస్యలు నిరాశ పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా. శారీరక రుగ్మతలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపారులకు గందరగోళం. ఉద్యోగులకు పనిభారం..చికాకులు..ఇష్ట దైవాన్ని తలుచుకోవడం మేలు..

కుంభం …ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు సామాన్యస్థితి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు..ఇంటా, బయట చికాకులు.

మీనం ...కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. భూములు, గృహం కొంటారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు..ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news