పచ్చి టమోటా అని అసలు కొనరు కదా.. తినటం వల్ల ఎన్ని లాభాలుంటాయో..!

-

మనం కూరగాయల మార్కెట్ కు వెళ్లినప్పుడు అన్నింటికంటే లాస్ట్ లో టమాటాలు తీసుకుంటాం..ఎందుకూ..తీసుకునేది పండువి, ముందే కవర్లో వేస్తే..చితికిపోతాయి. అలా టమాటాలు తీసుకునేప్పుడు..పచ్చివి అసలు వేసుకోరు. పండువి లేదా దోరగా ఉన్నేవే తీసుకుంటాం..పాపం పచ్చివాటని అసలు దేకం కదా.. కానీ పచ్చి టమోటాలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి మీకు తెలుసా..

గ్రీన్ టొమాటోలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చి టమోటాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎంత అవసరమే మనకు ఇప్పుడు బాగా తెలుసు.. త్వరగా అనారోగ్యం బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉండదు.

విటమిన్ K పచ్చి టమోటోలో పుష్కలంగా ఉంటుంది. పచ్చి టమోటాలు తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టదు. అంతేకాదు ఎక్కడైనా బ్లడ్ క్లాట్స్ ఉంటే వాటిని తొలగించి.. సాధారణ స్థితికి తీసుకొస్తుంది. తద్వారా స్ట్రోక్స్ వంటి సమస్యలు రాకుండా రక్షించుకోవచ్చు.

పచ్చి టమోటాలు తింటే కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చాలా మంది భావిస్తారు. పచ్చి టొమాటోలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల గ్రీన్ టొమాటోలను తినడం వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

పచ్చి టొమాటోలు రక్తపోటును తగ్గించడంలో కూడా చాలా సహాయపడతాయి. రక్తపోటు ఎక్కువగా ఉండే వారు పచ్చి టమోటాలు తినడం మంచిది. ఎందుకంటే ఇందులో సోడియం తక్కువ మోతాదులో, పోటాషియం అధిక మోతడులో లభిస్తుంది.

పచ్చి టమోటాలు చర్మానికి కూడా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల వృద్ధాప్య ప్రభావం తగ్గుతుంది. ఎల్లప్పుడూ.. యవ్వనంగా కనిపిస్తారు. ఆకుపచ్చ టమోటాలలో విటమిన్ సి అధిక మొత్తంలో లభిస్తుంది. దీని వల్ల చర్మ కణాలు ఏర్పడి.. ముడతలు తగ్గుతాయి. అప్పుడు మరింత అందంగా కనిపిస్తారు.

వావ్..ఇన్ని లాభాలు ఉన్నాయా..పచ్చిటామాటోలో. మనం ఇన్నాళ్లు ఇవి వగరుగా ఉంటాయి అని అసలు కొనటం కూడా మానేశాంగా..ఈసారి మార్కెట్ కు వెళ్లినప్పుడు ఇవి కూడా తీసుకోండి మరీ..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news