”ఇడ్లీ అమ్మ”‌కు ఇంటిని అంద‌జేసిన ఆనంద్ మ‌హీంద్రా.. నెటిజ‌న్ల పొగ‌డ్త‌లు..

Join Our Community
follow manalokam on social media

త‌మిళ‌నాడులో కేవ‌లం రూ.1కే ఇడ్లీలు అమ్మిన వృద్ధురాలు గుర్తుంది క‌దా. ఆమెను అక్క‌డంద‌రూ ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు. ఆమె అస‌లు పేరు కె.క‌మ‌ల‌త‌ల్‌. 2019 సెప్టెంబ‌ర్ నెల‌లో ఆమె గురించిన ఓ వీడియో వైర‌ల్ అయింది. ఆమె క‌ట్టెల పొయ్యి మీద ఇడ్లీలు చేస్తూ పేద‌లు, కూలీల‌కు కేవ‌లం రూ.1కే ఒక ఇడ్లీ అమ్మేది. ఆమె అలా 30 ఏళ్ల నుంచి ఇడ్లీల‌ను త‌యారు చేసి అందిస్తోంది. అయితే ఆమె వీడియో వైర‌ల్ అయ్యాక ఆమెకు స‌హ‌యం చేసేందుకు చాలా మంది ముందుకు వ‌చ్చారు.

anand mahindra gives house to idly amma

క‌మ‌ల‌త‌ల్ వీడియో వైర‌ల్ అయ్యాక మహీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా ఆమెకు ఎల్‌పీజీ క‌నెక్ష‌న్ ఇప్పించారు. అలాగే ఆమెకు ఇల్లు క‌ట్టిస్తాన‌ని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయ‌న ఆమెకు తాజాగా ఇంటిని అంద‌జేశారు. ఆమె ఇంటి ప‌త్రాల‌ను అందుకుంది. అప్ప‌ట్లో ఆమె త‌న‌కు ఓ ఇల్లు ఉంటే బాగుండున‌ని, దీంతో మ‌రింత మందికి ఇడ్లీల‌ను విక్ర‌యించేదాన్న‌ని చెప్పింది. ఆమె కోరిక తెలుసుకున్న ఆనంద్ మ‌హీంద్రా ఆమెకు ఇంటిని అంద‌జేశారు.

80 ఏళ్ల కె.క‌మ‌ల‌త‌ల్ త‌మిళ‌నాడులోని పెరూ అనే ప్రాంతంలో ఉన్న వ‌డివేళంపాల‌యం అనే గ్రామంలో ఉంటుంది. ఆమెకు ఇప్పుడు ఇల్లు వ‌చ్చింది. ఎల్‌పీజీ కూడా ఉంది. దీంతో మ‌రింత మందికి సేవ చేస్తాన‌ని చెబుతోంది. ఆమెకు ఇంటిని అందించినందుకు గాను నెటిజ‌న్లు ఆనంద్ మ‌హీంద్రాను కొనియాడుతున్నారు.

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...