ఐదేళ్లకే రచయితగా మారిన బాలిక.. గిన్నిస్‌బుక్‌లో రికార్డు

-

ఈ జనరేషన్‌ పిల్లలు చురకత్తులకంటే పదునుగా ఉన్నారు. వారి తెలివితేటలు చూస్తే..మనం ముక్కన వేలేసుకోవాల్సిందే. చూడ్డానికి బుడతల్లా ఉంటారు కానీ.. గిన్నిస్‌బుక్‌లో రికార్డు సాధిస్తున్నారు. ఒకర్ని మించిన వాళ్లు ఒకరు అన్నట్లు ఉన్నారు. ఐదు సంవత్సరాల పిల్లలకు అప్పుడప్పుడే మాటలు వస్తాయి. సరిగ్గా ఏం తెలియదు కూడా.. కానీ ఆ వయసుకే ఓ బుక్‌ రాసేసింది ఈ అమ్మాయి… ఆ బుక్‌ కూడా విపరీతంగా అమ్ముడుపోయింది..కట్‌ చేస్తే పాపకు గిన్నిస్‌బుక్‌లో స్థానం. అసలు ఐదేళ్ల వయసుకే రచయితగా ఎలా మారింది..ఇంతకీ ఏం బుక్‌ రాసిందో మీరు చూడండి.!

ఈ అమ్మాయి పేరు బెల్లా జె డార్క్.. గ్రేట్బ్రిటన్‌లోని వేమౌత్‌లో బెల్లా నివసిస్తుంది. ఈ చిన్నారి ఓ రచన చేయడమే కాదు.. ఆ పుస్తకాన్ని ప్రచురించడంతో.. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన రచయితగా పేరుగాంచింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ఆ చిన్నారి బాలిక పుస్తకం రాయడమే కాకుండా.. ఆ పుస్తకంలో కనిపించే చిత్రాలను కూడా ఆమె స్వయంగా రూపొందించిందట.

1000 కాపీలు అమ్మకం..

ఆ అమ్మాయి రాసిన పుస్తకం పేరు ‘ది లాస్ట్ క్యాట్ ‘. ఈ పుస్తకం ప్రచురించబడిన వెంటనే.. సుమారు వెయ్యి కాపీలు కూడా అమ్ముడయ్యాయట.తన కూతురు పుస్తకం రాయాలని చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకోలేదట. కానీ తన కుమార్తె.. పుస్తక రచన విషయంలో చాలా ఆలోచిస్తుందని.. రచనను చాలా సీరియస్‌గా తీసుకుందని తాను గుర్తించి.. అప్పటి నుంచి తాను బెల్లాకు మద్దతు ఇచ్చినట్లు బెల్లా తల్లి చెల్సియా.. ఇచ్చినట్లు తెలిపింది.
ఈ పుస్తకాన్ని… పుస్తకాల పబ్లిషర్ అయిన జింజర్ ఫెయిర్ ప్రెస్‌కి చేరుకోగానే ప్రచురించడానికి అంగీకరించారు. బెల్లా పుస్తకం ముద్రించబడింది. దీంతో బెల్లా ప్రపంచ రికార్డును సృష్టించింది.

‘ది లాస్ట్ క్యాట్ 2’ కోసం సిద్ధమవుతున్న బెల్లా:

ది లాస్ట్ క్యాట్’ కథ ఏమిటంటే.. పిల్లి ఎక్కడో తప్పిపోతుంది. అప్పుడు పిల్లి పిల్ల తన తల్లి లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకూడదని తెలుసుకుంటుంది. ఈ పుస్తకం పిల్లలకు మంచి సందేశం ఇస్తుందని పాఠకులు అభిప్రాయపడుతున్నారు… ఈ పుస్తకం జనవరి 31, 2022న ప్రచురించబడింది. ఇప్పుడు బెల్లా తన పుస్తకం ‘ది లాస్ట్ క్యాట్’ సెకండ్ సిరీస్ ను అంటే ‘ది లాస్ట్ క్యాట్ 2’ని వ్రాయడానికి సిద్ధమవుతోందట.

Read more RELATED
Recommended to you

Latest news