అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేయాలి: ఎంపీ లింగయ్య

-

యువత ఆశలపై నీళ్లు చల్లే అగ్నిపథ్ స్కీమ్‌కు వెంటనే రద్దు చేయాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశ సైనికులను బలహీన పరిచే విధంగా అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందుకే దేశవ్యాప్తంగా సైనికులు, యువత వ్యతిరేకిస్తోందని అన్నారు.

ఎంపీ లింగయ్య యాదవ్
ఎంపీ లింగయ్య యాదవ్

కేవలం నాలుగేళ్లు పని చేయించుకొని ఆ తర్వాత పదవీ విరమణ ఇవ్వడం సరైనది కాదని మంత్రి పేర్కొన్నారు. దేశ రక్షణ విభాగం ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. ఇలాంటి పథకాన్ని కేంద్రం ఎలా తీసుకొస్తుందో అర్థం కావట్లేదన్నారు. ఈ పథకంలో మార్పులు చేసి.. నిరుద్యోగులకు ఉపయోగపడేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రూ.40 వేల కోట్ల విలువైన భూములను అప్పగించిందని ఎంపీ లింగయ్య యాదవ్ అన్నారు. ఆ భూములను అమ్మేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భూములను అమ్మే హక్కు కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news