నీ పని పదిమందికి నచ్చలేదంటే దానికి విలువ లేదని కాదని చెప్పే నిజ జీవిత కథ.. 

-

ఆరేళ్ళ వయసున్న చిన్న పాపకి రచన అంటే ఎంతో ఆసక్తి. అది గుర్తించిన తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి ప్రోత్సహించారు. 15ఏళ్ళు వచ్చే వరకు బాగానే ఉన్న పాపాయి జీవితంలోకి ఒక్కసారిగా కష్టాలు వచ్చాయి. వాళ్ళ నానమ్మ చనిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ చనిపోయింది. దాంతో పూర్తిగా నిరాశలోకి దిగిపోయిన అమ్మాయికి, అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఇద్దరి అభిరుచులు బాగా కలిసిన తర్వాత బాగా దగ్గరవుతారు. ఆ తర్వాత సంవత్సరానికి పెళ్ళి చేసుకుని ఒక్కటి అవుతారు.

మరో సంవత్సరానికి పాప పుట్టింది. అప్పుడు భర్త నిజ స్వరూపం బయటపెట్టాడు. వదిలేశాడు. వెంటనే పాపను తీసుకుని సింగిల్ పేరేంట్ గా బాధ్యతలు తీసుకుంది. అప్పుడు పని చేయడానికి కేతిలో ఉద్యోగం కూడా లేదు. ఈ‌ఎం చేయాలో పాలుపోక, రచన ప్రారంభించింది. కాఫీ షాపులో రైటింగ్ చేస్తూ తన మొదటి రచనా పూర్తి చేసింది. ఆ తర్వాత ఆ రచనని పబ్లిషర్ కి పంపింది. రిజెక్ట్ చేసారు. మరో పబ్లిషర్ కు పంపింది. మళ్ళీ రిజెక్ట్. ఇలా పది మందికి పంపినా, రిజక్ట్ అనే సమాధానం వచ్చింది.

దాంతో తన రచన మీద నమ్మకం కోల్పోయిన ఆ రచయిత ఇంకో పబ్లిషర్ కి పంపింది. ఆ పబ్లిషర్, రచన చదవమని చెప్పాడు. ఆమె రచన చదువుతున్నప్పుడు చాలా ఆసక్తిగా విన్న ఆమె కూతురును గమనించిన ఆ పబ్లిషరు, పబ్లిషింగ్ కి ఒప్పుకున్నాడు. అప్పుడు విడుదలైన ఆ పుస్తకం ప్రపంచ చరిత్రలో రచన ద్వారా బిలియనీర్ అయిన వ్యక్తిని చేసింది.

ఆమె ఎవరో కాదు హ్యారీ పోటర్ సిరీస్ రచయిత జేకే రోలింగ్. ఆ పుస్తకమే హారీ పోటర్. ఆ తర్వాత ఆ సిరీస్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్, ప్రపంచంలోనే బిలియనీర్ గా ఎదిగిన రచయిత అంటూ ప్రచురించింది.

జేకే రోలింగ్.. ఎన్నోకష్టాలు పడి, అన్నింటినీ తట్టుకుని ఎదిగారు. తనకు వచ్చిన పేరు ఒక్కరోజులో వచ్చింది కాదు. మీరు చేసిన చాలామందికి నచ్చకపోవచ్చు. దానర్థం మీ పని బాగాలేదని, లేదా మీకు పని రాదని కాదు. మీరు చేసిన పని అవతలి వారికి అవసరం లేకపోవడం కూడా కావచ్చు. అందుకే మీ గురించి మీరు నమ్మండి. అప్పుడే సక్సెస్ సాధిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news