ఆచార చాణక్య ఎన్నో మంచి విషయాలను చెప్పారు. వీటిని కనుక మనం జీవితంలో ఆచరిస్తే జీవితాంతం ఆనందంగా ఉండేందుకు అవుతుంది. అలానే జీవితంలో మన గమ్యాన్ని చేరుకోవడానికి కూడా అవుతుంది. ఆచార్య చాణక్య ఈ నలుగురికి దూరంగా ఉండమని వీళ్ళ తో వాదన వద్దు అని… అసలు వాళ్లతో పెట్టుకోకూడదని చెప్తున్నారు మరి ఎటువంటి వ్యక్తులతో మనం వాదనకి దూరంగా ఉండాలి అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయంలో ఈ నలుగురు వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
మన గురువుగారు:
మన గురువు గారితో మనం వాదనకి దిగకూడదు గురువుగారికి ఈ విషయంలో దూరంగా ఉండాలి. అజ్ఞానాన్ని తొలగించేసి విజ్ఞానాన్ని ఇచ్చే గురువుకి మనం గౌరవం ఇవ్వాలి తప్ప వాదించుకోకూడదు.
మూర్ఖుడు:
మూర్ఖుడు తో ఎప్పుడు వాదన పెట్టుకోకూడదు నిజం అబద్ధం తేడా తెలియకుండా మూర్ఖుడు అనవసరంగా వాదిస్తూ ఉంటాడు. ఇలాంటి వారితో వాదించడం కంటే వదిలేసి బయటికి వచ్చేయడం మంచిది.
మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు:
మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళతో కూడా వాదన పెట్టుకోకూడదు. ఇలాంటి వారితో వాదనకి దిగితే మీకు వారికి కూడా ఇబ్బందే.
మంచి స్నేహితుడు:
మంచి స్నేహితుడుతో కూడా గొడవ పెట్టుకోకూడదు. మంచి స్నేహితులతో గొడవ పెట్టుకోవడం వలన ఒక మంచి స్నేహితుడు ని మీరు కోల్పోతారు పైగా స్నేహితుడు మంచి చెడు రెండు చెబుతూ ఉంటాడు కాబట్టి అస్సలు స్నేహితుడితో వాదన పెట్టుకోకండి.