రైతు కూతురి పెళ్లి ఏడాది ఆపేసిన గంట వర్షం, భార్య మెడలో బంగారు తాడు ఎప్పుడు…?

-

దరిద్రం ఎటు నుంచి ముంచుకు వస్తుందో ఎవడు చెప్తాడు…? కొంత మందిని ధైర్యం పలకరించే విధానం చూస్తే జాలి పడాలో ఏడవాలో అర్ధం కాలేదు. శనివారం ఉదయం పడిన వర్షం చూస్తే రైతులను చూసి ఏడుపు జాలీ అన్నీ వస్తాయి నాలుగు నెలల నుంచి మిర్చి, పత్తి, పుచ్చ తోటలు, పూల తోటలు, ఇలా పదుల సంఖ్యలో పంటలు నాశనం అయిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు అలా పడుకునిపోయాయి.

మిర్చి కోతలు సంక్రాంతి తర్వాత మొదలవుతాయి. ఇళ్ళ దగ్గర కల్లాలు వేసుకుని ఆర బేడతారు. నాలుగు నెలలకు పైగా కష్టం అది. వేల రూపాయలు ఖర్చు పెట్టి రైతులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కూతురు పెళ్లి చేద్దాం అని, అప్పులు తీర్చేద్దాం అని ఎందరో రైతులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కాని శనివారం ఉదయం పడిన ఒక వర్షం వారి ఆశలను వాయిదా వేసి అప్పుల వడ్డీలను పెంచి, భార్య మెడలో పసుపు తాడే వేలాడుతూ రైతుని అలా కూర్చోబెట్టింది.

ఎం చెప్పాలి రైతు… శుక్రవారం అర్ధరాత్రి దాటిన దగ్గరి నుంచి కృష్ణా, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షం పడింది. రేపు ఎండితే చాలు మార్కెట్ కి తోలేద్దాం మిర్చిని అనుకున్నాడు రైతు. కాని ఏమైంది… అర్ధ రాత్రి గురక నిద్రను లేపింది… తెల్లవార్లు భార్యా కూతురు, కొడుకు పరుగులు పరుగులు. కంటి నిండా నిద్ర లేదు, కళ్ళల్లో నీళ్ళు. పుచ్చ తోటలు కూడా అంతే, పూల తోటలు అలాగే అయిపోయాయి.

పత్తి కూడా తడిచిపోయింది. ఆ రైతు కష్టం ఎవడు వింటాడు. ఎవడికి ఓపిక ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రైతు హీరో అని ఒకడు అంటాడు, రైతు గుండె గట్టిది అంటాడు. ఎవడికి తీరిక ఉంది రైతు గురించి ఆలోచించడానికి. వేల ఎకరాలు అలా నాశనం అయిపోయింది ఇప్పుడు. పొద్దున్నే కాఫీ నీళ్ళు పోసే పెళ్ళాం… నీదే తప్పు అంటది. అలా ఎందుకు నాన్నా అని కూతురు అంటది. నా మాట వినలేదని కొడుకు అంటాడు.

ఏముంది కష్టపడ్డాడు, అలా కళ్ళ ముందు నాశనం అయిపోయింది. ఎవడు ఎం చేస్తాడు. అప్పులు ఇచ్చిన బ్యాంకు ఆగుతుందా…? జూన్ లో కట్టే కూతురు కాలేజి ఫీజు ఆగుతుందా…? ఏది ఆగదు. వాటి తో పాటే కన్నీళ్లు కూడా ఆగవు. ఈ మూడు జిల్లాల్లో శనివారం అకాల వర్షం చేసిన నాశనం అంతా ఇంతా కాదు. కూతురు పెళ్ళిళ్ళు కూడా గంట వర్షం వాయిదా వేసింది. రైతు కదా… గుండె గట్టిగానే ఉంటది.

Read more RELATED
Recommended to you

Latest news