స్ఫూర్తి: క్యాప్సికం తో కోట్లలో ఆదాయం..అంగవైకల్యం వున్నా సరే..!

-

ఒక్కొక్కసారి కొందరి కథని చూస్తే ఎంతో ఆదర్శంగా ఉంటుంది. నిజంగా ఈ వ్యక్తి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక రైతు క్యాప్సికమ్ ని పండిస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. అందరి జీవితంలా అతని జీవితం సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు తో జీవితం సాగుతూ వచ్చింది.

కుటుంబం కోసం తను ఎన్నో బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది. పైగా అతనికి ఉన్నది కేవలం 1.6 ఎకరాల పంట భూమి మాత్రమే. అతని పేరు అలోక్. పోలియో కారణంగా అంగవైకల్యం సంభవించింది. తన కుటుంబంలో తల్లి మరియు సోదరి కూడా వికలాంగులు.

దీంతో అతని పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అతని తండ్రి కూడా రైతే. తాను కూడా వ్యవసాయం చేస్తూ వచ్చిన డబ్బుల్ని కుటుంబ పోషణకు ఖర్చు చేసేవారు అయితే ఒకసారి న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ని చదివి జీవితంలో కొత్త ప్రయత్నం చేశారు.

అలాగే క్యాప్సికం పంటని మంచిగా పండించే పద్ధతుల్ని నేర్చుకుని ఆ దారిలో వెళ్ళడం మొదలు పెట్టారు అయితే మొదట్లో ఎన్నో కష్టాలు వచ్చాయి. అయినప్పటికీ తాను ప్రయత్నాన్ని వదల్లేదు. తనకి ఉండే పంట భూమిలో వ్యవసాయాన్ని చేస్తూ ఒకపక్క కష్టాలన్నీ తట్టుకుంటూ ముందుకు సాగారు.

ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి మొదట స్టెప్ అని అందరికీ తెలుసు తాను కూడా అదే విధంగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్తున్నాడు. తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుని క్యాప్సికం పండిస్తున్నారు. రెండోసారి ప్రయత్నించినప్పుడు సక్సెస్ అయ్యారు క్రమంగా ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి.

సోషల్ మీడియాలో అతని గురించి తెలిసిన వాళ్ళు అభినందించడం మొదలుపెట్టారు. ఈసారి మళ్లీ రిస్క్ తీసుకుని 24 ఎకరాల్లో క్యాప్సికం పంటను పండించి కోటి రూపాయలు సంపాదించారు 15 లక్షల పంటతో 85 లక్షల ప్రాఫిట్ వచ్చింది. నిజంగా అలోక్ ని ఎంతో మందికి ఆదర్శంగా తీసుకోవాలి. 500 మందికి పైగా రైతులకి పండించడం కూడా నేర్పుతున్నారు. ఇతన్ని పక్కా అభినందించాల్సిందే. రైతుల ఇతన్ని ఆదర్శంగా తీసుకుంటే కష్టాలు గట్టెక్కుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news