స్ఫూర్తి: మూడంతస్తుల ఇంట్లో మొక్కలు.. ఏడాదికి డబ్భై లక్షలు..!

-

కొందరు మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఒక్కొక్కసారి మనకి అనిపిస్తూ ఉంటుంది మనం ఏం చేయగలం..? మనకి ఏం వచ్చు అని కానీ నిజానికి ఒక మంచి ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈయన చేసిన పనిని చూస్తే తప్పకుండా మెచ్చుకుంటారు.

ఏదైనా సాధించాలంటే మన దగ్గర ఓపిక టైం ఉంటే సరిపోతుంది ఆస్తులు డబ్బులు ఇవేమీ అక్కర్లేదు. అయితే మనం ఏదైతే దృఢంగా అనుకుంటామో దానిని మనం ముందుకు నడిపించాలి. 2009లో జర్నలిస్టు కింద పనిచేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ఏకంగా ఏడాదికి 70 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అతని పేరు రామ్ వీర్ సింగ్. కెమికల్స్ ఉండే కూరగాయలను తీసుకోవడం వలన తన తండ్రి క్యాన్సర్ బారిన పడినట్లు అతనికి తెలిసింది.

అప్పటి నుండి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఉద్యోగాన్ని వదిలేసి నాచురల్ ఫార్మింగ్ పైన దృష్టి పెట్టాడు. తన మూడంతస్తులు ఇల్లుని కూడా మొక్కలతో నింపేశాడు. 10,000 పైగా మొక్కలు వారి ఇంట్లో ఉన్నాయి. కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా తను పండిస్తూ ఉంటాడు.

పీవీసీ పైప్స్ ద్వారా మొక్కలకి నీటిని ఇస్తూ ఉంటాడు. మొక్కలకి మెగ్నీషియం కాపర్ ఫాస్ఫరస్ నైట్రోజన్ జింక్ అన్ని కూడా సరిగ్గా వెళ్లేటట్టు చూసుకుంటాడు అన్ని మొక్కలకి కూడా సమానంగా ఇవి వెళ్లేటట్టు చూసుకుంటాడట.

ఈ ఫారం పేరు వెంప ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్స్. ఇలా సాగు చేస్తూ ఏడాదికి 70 లక్షల రూపాయలని ఈ జర్నలిస్టు సంపాదిస్తున్నారు చాలామంది ఏం చేయాలి ఎలా డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దానికే సమయం గడిచిపోతుంది. ఏం చేయాలి అని అనుకునే వారు ఇతన్ని ఆదర్శంగా తీసుకుంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news