మీ జీవన విధానంలో ఈ సంకేతాలు కనిపిస్తే కొద్దిగా ఆగండి.. లేకుంటే ప్రమాదమే..

-

గత సంవత్సరం కరోనా వల్ల ఎంత భీభత్సం జరిగిందో అందరికీ తెలిసిందే. దానివల్ల అందరి జీవన విధానాల్లో మార్పులు వచ్చాయి. అప్పటి వరకూ తరగతి గదుల బోధనకే అలవాటు పడ్డ విద్యార్థులు, ఆన్ లైన్ క్లాసులకి అలవాటు పడాల్సి వచ్చింది. ఆఫీసు వేళల్లో పనిచేసే ఉద్యోగస్తులకి వేళ కాని వేళల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విపరీతమైన సమాచారం వల్ల మెదడు ఒత్తిడికి లోనైంది. దీనివల్ల జీవన విధానంలో మార్పులు సంభవిస్తున్నాయి. అలాంటప్పుడే కొద్దిగా బ్రేకులు వేసి, మెల్లగా నడవాల్సి ఉంటుంది.

మీ జీవన విధానానికి ఎప్పుడు బ్రేకులు వేయాలో తెలిపే కొన్ని సంఘటనలు చూద్దాం

ఆహార అలవాట్లు మారినపుడు

ఒత్తిడి ఎక్కువవుతుంటే తిండి ఎక్కువ తింటారు. చాలా మంది లావు పెరగడానికి ఇదే కారణం. మీరే టైమ్ లో తింటున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆకలి అవకుండానే ఆహారం తీసుకోవడం, అయినపుడు తీసుకోకపోవడం ప్రమాదానికి దారి తీస్తుంది.

విశ్రాంతి లేకపోవడం

బెడ్ మీద పడుకున్నప్పుడు లేవడానికి నిరాకరించడం, పడుకున్నా ఏదో అలసటగా ఫీలవడం మొదలైనవన్నీ మెదడుకి విశ్రాంతి ఇవ్వని లక్షణాలే. ఇది మీకు తరచుగా సంభవిస్తుంటే మీ జీవన విధానంలో ఏదో లోపం ఉందన్నమాటే. వ్యాయామం, ధ్యానం అలవాటు చేసుకోండి.

ప్రేరణ లేకపోవడం

చేస్తున్న పనినే రోజూ చేయడం వల్ల ప్రేరణ కలగకపోవడం, సరైన నిద్ర, ఆహారం ఉన్నప్పటికీ మీ పనులు ముందుకు సాగట్లేదంటే మీలో ప్రేరణ లేదన్నమాట.

తక్కువ రోగ నిరోధక శక్తి

రోగాల నుండి తట్టుకునే శక్తి తక్కువగా ఉండడం వల్ల తరచుగా జబ్బు పడడం కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలను తీసుకోవడం వల్ల దీన్నుండి బయటపడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news