ఒకప్పుడు రూ. 150 జీతం..నేడు 100 కోట్లకు అధిపతి..

-

చెయ్యాలనే పట్టుదల..సాధించాలనే కృషి ఉంటే కొండను సైతం పిండి చెయ్యొచ్చు అన్న విషయం తెలిసిందే..ఆకలి కసిని ఆయుదంగా మార్చుకొని ఎందరో నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచారు.ఇప్పుడు మరో వ్యక్తి కూడా నెలకు 150 రూపాయల జీతం నుంచి మొదలు పెట్టి.. కృషితో పట్టుదలతో వందల కోట్ల సంపాదించే స్టేజ్ కు చేరుకున్నాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి.. బతకడం కోసం వెయిటర్ గా పనిచేసి.. నేడు తనకంటూ ఓ వ్యాపార సామ్రాజ్ఞాన్ని సృష్టించుకున్నాడు.. అతనే ప్రేమ్ గణపతి.. కష్టాల కడలిని ఈది.. తినడానికి లేని స్థితి నుండి 50 సంవత్సరాల వయసులోపే కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ చరిత్ర సృష్టించాడు.అతని సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

తమిళనాడు కు చెందిన ప్రేమ్ గణపతి 17 ఏళ్ల వయసున్నప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చిన గణపతి బతకడం కోసం దేశ ఆర్ధిక రాజధాని ముంబై కి చేరుకున్నాడు. ఆకలి కేకలు వెయ్యడంతో ఓ బేకరీలో అంట్లు తోమే పనిలో జాయిన్ అయ్యాడు. ఆ బేకరీ యజమాని ప్రేమ్ కు తిండి పెట్టి.. షల్టర్ ఇచ్చి నెలకు 150 రూపాయలు ఇస్తాను అన్నాడు. దీనికి సరే అన్న ప్రేమ్ పనిలో జాయిన్ అయ్యాడు. అలా రెండు ఏళ్ళు పనిచేశాడు..

1997లో ఓ చిన్న ప్లేస్ ను లీజ్ కు తీసుకొన్నాడు. దానికి నెలకు 5 వేలు రెంట్.. ప్రేమ్ దోశ ప్లాజా అనే పేరుతో రెస్టారెంట్ ను ఓపెన్ చేశాడు. తన దోశ ప్లాజా లో డిఫరెంట్ దోశలను ప్రజలకు పరిచయం చేయాలను కున్నాడు. మొదటి సరిగా 26 రకాల దోశలను పరిచయం చేశాడు. స్ప్రింగ్ రోల్ దోశ, పన్నీర్ చిల్లీ దోశ వంటి డిఫరెంట్ దోశలను ముంబై వాసులకు పరిచయం చేశాడు. దీంతో 2002 నాటికి ప్రేమ్ దోశ అందరికీ ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ అడ్డాగా మారింది. ఇలా 130 వరకూ రకరకాల దోశలు వెయ్యడం మొదలు పెట్టాడు..ఆ తర్వాత షాపింగ్ మాల్ లో టిఫిన్ సెంటర్ పెట్టాడు..

మన దేశం మొత్తంలో 45 ఔట్ లెట్స్ వెలిశాయి. యూఏయి, ఒమన్, న్యూజిల్యాండ్ ఇలా మొత్తం మూడు దేశాల్లో కలిపి 72 ఇంటర్నేషనల్ ఔట్ లెట్స్ వెలిశాయి. అంతేకాదు ప్రేమ్ కు ఫ్రాంచైజీ రిక్వెస్ట్ లు విదేశాలనుంచి స్వదేశం నుంచి వెళ్లువెత్తాయి. ఒకప్పుడు రూ. 150 జీతంతో బతికిన గణపతి… నేడు కరోడ్ పతి.. 100 కోట్ల సంస్థ అధిపతి అయ్యాడు.అది అతని సక్సెస్ స్టోరీ.. ఆలోచన, కాస్త కష్టం ఉంటే ఏదైనా చెయ్యొచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news