జీరో నుంచి హీరోగా ఎదిగాడు.. పేటీఎం సృష్టికర్త విజయ్ సక్సెస్ స్టోరీ

-

విజయ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ దగ్గర్లోకి ఓ చిన్న పల్లె. తండ్రి టీచర్. చాలా నిజాయితీ గల వ్యక్తి. తండ్రి ఎంత నిజాయితీ పరుడో.. కొడుకు కూడా అంతే. విజయ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. చాలా ఫాస్ట్.

విజయం ఊరికే వస్తుందా? దాని కోసం ఎన్నో త్యాగాలు చేయాలి. ఎంతో చెమటోడ్చాలి. అప్పుడే విజయం నీకు దాసోహం అంటుంది. జీరోగా ఉన్న నిన్ను కూడా హీరోను చేస్తుంది. ఇప్పుడు మనం చదువుకోబోయే వ్యక్తి కూడా జీరో నుంచి స్టార్ట్ అయిన వ్యక్తే. కానీ.. ఇప్పుడు హీరో. బిలియనీర్. ఈకామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి మొబైల్ వ్యాలెట్లకు ఓ దారి చూపాడు. ఆయనే పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ.

paytm founder vijay shekhar sharma success story

ఆయన గురించి చెప్పకోవాలంటే చాలా ఉంది. పేజీలకు పేజీలు రాయొచ్చు. కానీ.. అదంతా వద్దు. ఆయన జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగాడో మాత్రం తెలుసుకుందాం. విజయ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ దగ్గర్లోకి ఓ చిన్న పల్లె. తండ్రి టీచర్. చాలా నిజాయితీ గల వ్యక్తి. తండ్రి ఎంత నిజాయితీ పరుడో.. కొడుకు కూడా అంతే. విజయ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. చాలా ఫాస్ట్.

ఏదో కంపెనీలో పని చేసే టైప్ కాదు విజయ్. తనకు తానుగా సొంత కంపెనీ పెట్టి.. పది మందికి ఉపాధి కల్పించాలనేది ఆయన లక్ష్యం. అందుకే ఇంజినీరింగ్ కోర్సు చదువుతున్నప్పుడే ఓ స్టార్టప్ ప్రారంభించాడు. ఓ కంటెంట్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశాడు. ఆ తర్వాత మరో స్టార్టప్. తర్వాత వన్ 97 అనే కంపెనీని పెట్టాడు. అతడు వన్ 97 అనే కంపెనీ పెట్టినప్పుడు మొబైల్‌కు ఇన్‌కమింగ్ కాల్స్‌ను ఉచితంగా అందిచడం మొదలు పెట్టాయి నెట్‌వర్క్ కంపెనీలు. వివిధ నెట్‌వర్క్ కంపెనీల యూజర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా కొన్ని సర్వీసులను అందించేందుకు మొదలు పెట్టిందే వన్ 97. అయితే.. నెట్‌వర్క్ కంపెనీలు సరైన సమయానికి డబ్బులు ఇవ్వక.. కంపెనీ నష్టాల బాట పట్టింది. కంపెనీని నడపడానికి అప్పు తేవాల్సి వచ్చింది. కంపెనీ పెట్టిన మూడేళ్లకు తిరిగి చూసుకుంటే విజయ్ జేబులో ఉన్నది 10 రూపాయలు.

ఇలా కాదని… కంపెనీలోని 40 శాతం వాటా అమ్మేశాడు విజయ్. అయినా అప్పులు తీరలేదు. తర్వాత మెల్లగా కొత్త ఐడియాలను కంపెనీలో పెట్టడం ప్రారంభించాడు. దీంతో మెల్లగా కంపెనీ లాభాల బాట పట్టింది. ఇంతలో మనోడికి మరో ఆలోచన. మొబైల్ పేమెంట్ వాలెట్‌ను తెస్తే ఎలా ఉంటదని ఆలోచించాడు. అనుకున్నదే తడువుగా బోర్డు మెంబర్స్‌కు తన ఐడియాను చెప్పాడు. కానీ.. బోర్డు మెంబర్స్ అతడి ఆలోచనను నమ్మలేదు. ఈరోజుల్లో మొబైల్ వాలెట్‌ను ఎవరు ఉపయోగిస్తారని ఎద్దేవా చేశారు. పెట్టుబడికి ముందుకు రాలేదు.

అయితే.. విజయ్ ఓసారి హాంకాంగ్ వెళ్లాడు. అక్కడ అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్‌మాను కలిసే అవకాశం అతడికి దక్కింది. దీంతో తన దగ్గర ఉన్న మొబైల్ వాలెట్ ఆలోచనను అతడితో పంచుకున్నాడు. ఆ ఐడియా జాక్‌మాకు నచ్చడమే కాదు.. విజయ్ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధమయ్యాడు. వెంటనే తన ఆలోచనకు కార్యరూపం దాల్చాడు. అదే పేటీఎం.

అయితే.. పేటీఎంకు మొదట కస్టమర్లు ఆకర్షితులు కాలేదు. పేటీఎంను ఎవ్వరూ నమ్మలేదు. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటించినా పేటీఎంను ఎవ్వరూ ఇన్‌స్టాల్ చేసుకోలేదు.

దీంతో కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడం కోసం 24 గంటల కస్టమర్ కేర్ వ్యవస్థను తీసుకొచ్చాడు విజయ్. కస్టమర్లకు ఎటువంటి సమస్యలు వచ్చినా.. వెంటనే పరిష్కరించేలా ఏర్పాటు చేశాడు. అదే సమయంలో మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. అదే పేటీఎంకు టర్నింగ్ పాయింట్ అయింది. ప్రజల వద్ద రియల్ మనీ లేకపోవడంతో అందరూ పేటీఎం వాలెట్‌నే ఆశ్రయించారు. అలా ఒకేసారి కంపెనీకి 700 శాతం లాభాలు వచ్చాయి. ఒక్కసారిగా విజయ్ కుబేరుడు అయ్యాడు. తర్వాత పేటీఎంలో ఎన్నో కొత్త కొత ఫీచర్లను, ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాడు విజయ్.

పేటీఎం ద్వారా షాపింగ్, టికెట్స్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, మనీ ట్రాన్స్‌ఫర్, రీచార్జ్.. ఇలా అన్ని సౌకర్యాలను ఒకేచోట కల్పించి.. కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనడంలో సక్సెస్ అయ్యాడు విజయ్. దీంతో పేటీఎం ప్రస్తుతం ది బెస్ట్ మొబైల్ వాలెట్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకరు.. వారెన్ బఫెట్.. పేటీఎంలో 2300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. పేటీఎంలో 3 శాతం వాటాలు కొన్నారు. ప్రస్తుతం విజయ్ నికర ఆస్తుల విలువ 300 కోట్ల డాలర్లకు పైనే అంటే అర్థం చేసుకోవచ్చు.. విజయ్ ఎంత సక్సెస్ అయ్యారో. అలా.. విజయ్ జీరో నుంచి హీరోగా ఎదిగారు.

Read more RELATED
Recommended to you

Latest news