చ‌రిత్ర సృష్టించిన స్కాట్లండ్‌.. ఆ దేశంలో ఇక మ‌హిళ‌ల‌కు రుతు సంబంధ ప్రొడ‌క్ట్స్ ఫ్రీ..

-

స్కాట్లండ్ దేశం చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌పంచంలోనే తొలి సారిగా రుతు సంబంధ ప్రొడ‌క్ట్స్‌ను ఆ దేశ మ‌హిళలంద‌రికీ ఉచితంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో స్కాట్లండ్ ఈ స‌దుపాయం అందిస్తున్న మొద‌టి దేశంగా నిలిచింది. ఇక‌పై అక్క‌డ పీరియ‌డ్ ప్రొడ‌క్ట్స్ ను మ‌హిళ‌ల‌కు ఉచితంగా అందివ్వ‌నున్నారు. ఈ క్ర‌మంలో వారికి కావల్సిన శానిట‌రీ ప్యాడ్స్ త‌దిత‌ర ఉత్ప‌త్తులు ఉచితంగా ల‌భిస్తాయి.

scotland became first country to give menstrual products free to women

స్కాట్లండ్‌లో గ‌తేడాదే పీరియ‌డ్ ప్రొడ‌క్ట్స్ బిల్‌ను ప్ర‌వేశ పెట్ట‌గా దానికి ఇప్పుడు ఆమోదం ల‌భించింది. ఈ క్ర‌మంలో ఆ దేశ మ‌హిళ‌లంద‌రూ రుతు సమ‌యంలో ప్ర‌భుత్వం అందించే ప్రొడ‌క్ట్స్ ను ఉచితంగా వాడుకోవ‌చ్చు. అన్ని క‌మ్యూనిటీ సెంట‌ర్ల‌తోపాటు స్కూళ్లు, కాలేజీలు, ఇత‌ర ప్ర‌దేశాల్లో స‌ద‌రు ప్రొడ‌క్ట్స్‌ను మ‌హిళ‌ల‌కు పంపిణీ చేయ‌నున్నారు. ఈ విష‌యంపై అక్క‌డ విస్తృతంగా ప్ర‌చారం చేయ‌నున్నారు.

కాగా ఈ స‌దుపాయం అందిస్తున్నందుకు గాను ఆ దేశంపై 2022 వ‌ర‌కు 8.7 మిలియ‌న్ పౌండ్ల భారం ప‌డ‌నుంది. అయిన‌ప్ప‌టికీ స్కాట్లండ్‌లో ఉన్న 20 శాతం మంది పేద మ‌హిళ‌ల కోసం ఈ స‌దుపాయం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అక్క‌డ రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జా సంఘాలు, మ‌హిళా సంఘాలు అభిప్రాయ ప‌డ్డాయి. అందుక‌నే ఆ బిల్లుకు ఏక‌గ్రీవ ఆమోదం ల‌భిచింది.

Read more RELATED
Recommended to you

Latest news