అస్ట్రేలియా గడ్డ సత్తా చాటిన ఇండియన్ కుర్రాడు .. సక్సెస్ స్టోరీ..

-

కష్టే ఫలి .. కృషి ఉంటే మనుషులు మహా పురుషులు అవుతారు అని పెద్దలు ఎప్పుడూ చెబుతారు.సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. తాజాగా ఓ కుర్రాడు అదే చేసి చూపించాడు.ఎయిర్ పోర్ట్ లో క్లినర్ గా ఉద్యోగం చేసి ఇప్పుడు ఓ కంపెనీ స్థాయికి చేరుకున్నాడు .అతని సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం..

- Advertisement -

భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ కి చెందిన యువకుడు అమీర్ కుతుబ్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు అమీర్ కుతుబ్. ఎన్నో కష్టాలు పడి ఇక్కడ భారత్ లో డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఇక 23 ఏళ్ల వయసులో అందరిలానే అమీర్ కూడా ఉన్నతవిద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి ఓ కళాశాలలో ఎంబీఏలో చేరాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అతని కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతా మాత్రమే. దాంతో అక్కడికి వెళ్లిన తర్వాత ఇంటి నుంచి అమీర్‌కు ఆర్థికంగా సాయం అందలేదు.

ఉద్యోగ వేటలో పడ్డాడు. ఈ క్రమంలో 300కు పైగా కంపెనీలు తిరిగాడు. కానీ, ఎక్కడ మనోడికి జాబ్ దొరకలేదు. దాంతో చేసేదేమిలేక విక్టోరియాలోని అవెలాన్ విమానాశ్రయంలో క్లీనర్‌గా చేరాడు.ఆలా రెండేళ్లు పాటు చాయ్ చాలని జీతంతో కాలం నెట్టుకొని వచ్చాడు. అమీర్‌కు ఐసీటీ గీలాంగ్ అనే టెక్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇక్కడే అమీర్ జీవితం కొత్త మలుపు తీసుకుంది. అమీర్ తన ప్రతిభతో కంపెనీలో చేరిన చాలా తక్కువ వ్యవధిలోనే ఆపరేషన్ మేనేజర్‌గా ప్రమోషన్ అందుకున్నాడు. దాంతో కంపెనీ జనరల్ మేనేజర్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరికింది.అలా మనోడు మేనేజర్ స్థాయికి వెళ్ళాడు.

2014లో కేవలం 2వేల డాలర్లతో ‘ఎంటర్‌ప్రైజ్ మంకీ ప్రొప్రైటర్ లిమిటెడ్’ అనే ఓ టెక్ కంపెనీని నెలకొల్పాడు.ఆ కంపెనీ అంచెలఅంచెలుగా ఎదిగింది. ఇవాళ ఈ సంస్థలో 100 మంది వరకు ఉద్యోగులు అందులో పని చేస్తున్నారు. అలా దేశం కానీ దేశం వెళ్లి చెప్పుకోలేని కష్టాలను దిగమింగుకొని ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...