టెలిఫోన్ ఆపరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన ఎంపీ..!

-

ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న వారిలో రాజస్థాన్ లోని బికనూర్ ఎంపీ అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ఒకరు. ఆయన వయసు 65. ఇప్పటికి ముడుసార్లు ఎంపీగా గెలిచారు. ఇదివరకు కూడా మోదీ కేబినేట్ లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అంతా సిద్ధమైంది. దేశ ప్రధాన మంత్రిగా రెండో సారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు మోదీతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మోదీతో పాటు మరో 60 మంది దాకా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారట. ఎన్టీఏ భాగస్వామ్య పక్షాలు అయిన శివసేన, జేడీయూ, అప్నాదళ్, ఎల్జేపీ పార్టీలకు కూడా ఈసారి మంత్రులుగా అవకాశం దక్కనుంది. మరోవైపు తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న వారిలో రాజస్థాన్ లోని బికనూర్ ఎంపీ అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ఒకరు. ఆయన వయసు 65. ఇప్పటికి ముడుసార్లు ఎంపీగా గెలిచారు. ఇదివరకు కూడా మోదీ కేబినేట్ లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు కూడా ఆయనకు పిలుపు వచ్చింది. మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అయితే.. ఆయన మేఘవాల్ కెరీర్ టెలిఫోన్ ఆపరేటర్ గా ప్రారంభమయింది. ఆపరేటర్ గా చేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు. అలా.. 1982 లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో ఉత్తీర్ణత సాధించి పలు అత్యున్నత పదవులు చేపట్టారు.

ఎన్నో కీలక పదవులు చేపట్టి.. ఐఏఎస్ గా కూడా ప్రమోట్ అయ్యారు. 2009లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీలో చేరారు. రాజస్థాన్ లోని బికనూర్ ఎంపీగా మూడుసార్లు గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి.. 19 వేల మెజారిటీతో గెలిచారు. 2014లో కూడా విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి మళ్లీ ఎంపీ అయ్యారు. పీఎంవో ఆఫీసు నుంచి ఆయనకు కబురు రావడంతో మళ్లీ కేంద్రమంత్రి కాబోతున్నారు. అలా టెలిఫోన్ ఆఫరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగాడు మేఘవాల్.

Read more RELATED
Recommended to you

Latest news