వేరే చోట నాటేందుకు చెట్టును వేళ్లతో సహా తొలగించారు.. ప్రజల మనస్సులు గెలుచుకున్నారు..

-

చెట్లను నరికివేయడం సులభమే. కానీ మొక్కలను నాటి వాటిని సంరక్షించి చెట్లు tree గా మార్చడం చాలా కష్టం. అందుకు ఎంతో శ్రమపడాలి. ఒక మొక్క చెట్టుగా ఎదిగేందుకు ఎంతో కాలం పడుతుంది. చెట్టుగా మారాక అది మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అలాంటి చెట్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అవును.. సరిగ్గా ఇలా అనుకున్నారు కాబట్టే వారు చేసిన పని అందరినీ ఆలోచింప జేస్తోంది.

చెట్లు/ tree
చెట్లు/ tree

జార్ఖండ్‌ లోని రాంచీలో ఉన్న ఓ చోట కొందరు చెట్టును వేళ్లతో సహా పెకిలించి వేరే చోట నాటేందుకు దాన్ని తరలించారు. ఈ విధానాన్ని చాలా చోట్ల అమలు చేస్తున్నారు. ఏవైనా పనులకు చెట్లు అడ్డంకిగా ఉన్నాయని భావిస్తే వాటిని తొలగిస్తారు. కానీ అలా కాకుండా వాటిని వేళ్లతో సహా తీసి ఇంకో నాటవచ్చు. దీంతో ఎంతో విలువైన వృక్ష సంపదను రక్షించిన వారమవుతాం. వారు కూడా సరిగ్గా ఇలాగే చేశారు.

ఇక ఆ సమయంలో తీసిన ఫొటోను అక్కడి డిప్యూటీ కలెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ట్విట్టర్‌ షేర్‌ చేశారు. దీంతో ఫొటో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆ పనిచేసిన ఆ ప్రాంతవాసులను అందరూ మెచ్చుకుంటున్నారు. వృక్షాల విలువ తెలుసు కనుకనే వారు ఆ పనిచేశారని, అభివృద్ధి పనులకు అడ్డుగా వస్తే చెట్లను నరికివేయడమే చాలా మందికి తెలుసు కానీ వాటిని ఇలా ఇంకో చోట నాటే పని ఎవరూ చేయరని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ ప్రాంత వాసులను అందరూ ప్రశంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news