మానసికంగా ధృఢంగా అవ్వాలంటే ఈ విషయాలు తెలుసుకోండి..

-

ఆరోగ్యం అంటే శారీరకంగా దృఢంగా ఉండడం మాత్రమే కాదు, మానసికంగానూ దృఢంగా తయారవ్వాలి. చాలామంది మానసికంగా బలహీనంగా ఉంటారు. అందువల్లనే ఎక్కువ ఆలోచిస్తూ అనవసరమైన విషయాలకి బాధపడుతుంటారు. శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తుంటాం. అలాగే మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

మీ భావాలని పంచుకోండి

మిమ్మల్ని బాధపెట్టే సందర్భం ఎదురైనపుడు బాధపడండి. అవతలి వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వెంటనే ఆ విషయం వారికి తెలిసేలా చేయండి. చెప్పాలా వద్దా అన్న సంధిగ్ధంలో అది పెరుగుతూ పోయి ఏదో ఒకరోజు బాంబులా పేలుతుంది. అప్పుడు విడిపోయిన బంధం మళ్ళీ అతుక్కోదు.

విషం చిమ్మే మనుషులతో జాగ్రత్త

మీ చుట్టూ ఉండీ, మీ పైనే బయట చెడుగా చెప్పే వాళ్లని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దూరం పెట్టండి. చూసీ చూడనట్టు వదిలేయడం అస్సలు మంచిది కాదు. అలాంటి వాళ్ళు మీ పక్కనున్నన్ని రోజులు మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు.

రియాక్ట్ అవకండి..

ఏ విషయంలోనైనా రియాక్ట్ అవడం కంటే రెస్పాండ్ అవడం మంచిది. ఎందుకంటే అవతలి వాళ్ళు చేసే పనిని నువ్వు ఆపలేవు. కానీ నిన్ను నువ్వు ఆపుకోగలవు. అందుకే రియాక్ట్ అవ్వద్దు. రెస్పాండ్ అవ్వండి.

ఎక్కువ ఆలోచించవద్దు

ఏదైనా ఇబ్బంది ఎదురవగానే దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించవద్దు. నీకు ప్రమాదం జరిగితే, తప్పేం జరిగిందో తెలుసుకోకుండా యాక్సిడెంట్ చేసిన వాడిని జైళ్ళో తోసేసినట్టు మొదలగు ఆలోచనలు చేయకండి.

ధ్యానం

రోజూ ఒక 30నిమిషాల పాటు ధ్యానం చేస్తే మానసికంగా దృఢత్వం వస్తుంది.

వ్యాయామం

కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి.

అన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు ఆలోచించవద్దు. ఈ జీవితం నీది.. నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావో అలా ఉండాలి. ప్రతీదానికి ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తే అక్కడే ఆగిపోతావు.

Read more RELATED
Recommended to you

Latest news