30 లక్షల మందితో 620 కిలోమీటర్లు ఉమెన్స్ వాల్… ఎందుకంటే?

-

Women wall program conducted in Kerala on January first

ఉమెన్స్ వాల్… ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు దాదాపు 30 లక్షల మందితో దాదాపు 620 కిలోమీటర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జనవరి 1 న కేరళలో ఈ కార్యక్రమం ఉంటుంది. కేరళ ప్రభుత్వం, కొన్ని ఎన్జీవోలు కలిసి ఈ ఉమెన్స్ వాల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. సాంస్కృతిక పునర్జీవ విలువలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఉమెన్స్ వాల్ ను నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి.

మహిళలపై వివక్షను అడ్డుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కేరళ సీఎం విజయన్ తెలిపారు. తిరువనంతపురం, అలప్పుజ, కోజికోడ్, కన్నూర్, మలప్పురం, ఇడుక్కి ప్రాంతాల మీదుగా ఈ ఉమెన్స్ వాల్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కేరళ మహిళా కమిషన్ చైర్మన్ జోసెఫైన్ ప్రారంభించి ఆమె కూడా మొదటి సభ్యురాలిగా పాల్గొంటారు.

ఈ ఉమెన్స్ వాల్ కి కౌంటర్ గా… గత బుధవారం రాత్రి… హిందూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 40 లక్షల కేరళ ప్రజలు అయ్యప్ప జ్యోతితో మానవ హారం నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news