పీవీ సింధూను ఆంటీ అని పిలిచిన సానియా మీర్జా.. ఎందుకో తెలుసా?

-

Sania Mirza calls PV sindhu as Auntie

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. తన బాబుకు ఇజాన్ అనే పేరు పెట్టారు. తన బాబుకు సంబంధించిన ఫోటోలు, ఇతర విషయాలన్నింటినీ సానియా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నది. ఇక.. తన కొడుకును చూడటానికి సానియా ఇంటికి ప్రముఖ సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు.

తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధూ, స్క్వాష్ ప్లేయర్ జోష్న చిన్నప్ప సానియా కొడుకును చూడటానికి వెళ్లారు. ఈసందర్భంగా వాళ్లతో సానియా ఫోటో దిగి.. ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అంతే కాదు.. ఆ ఫోటోకు సరదాగా క్యాప్సన్ కూడా పెట్టింది. ఇజాన్ ను చూడటం కోసం వచ్చినందుకు థ్యాంక్యూ సింధూ ఆంటీ… థ్యాంక్యూ జేసీ ఆంటీ అంటూ ట్వీట్ చేసింది సానియా మీర్జా.

Read more RELATED
Recommended to you

Latest news