ఒంట్లో 6 ఆత్మలు.. 23 ఏళ్లకే 67 సార్లు భూత వైద్యం..అయినా నయం కాలేదు..చివరికి..

-

దెయ్యాలు అంటే కొందరికి భయం ఉంటుంది.. అవి ఉన్నాయని బలంగా నమ్ముతారు.. ఇంకో బ్యాచ్‌ ఉంటుంది. వీళ్లకు భయం ఉండదు కానీ..తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం విపరీతంగా ఉంటుంది. ఇప్పటికీ దెయ్యాలు ఉన్నాయా, అవి నెగిటివ్‌ వైబ్స్ మాత్రమేనా అనేదానికి సమాధానం లేదు. ఎవరికి నచ్చింది వాళ్లు ఫాలో అవుతున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రస్టింగ్‌ స్టోరీ ఉంది. ఈమెకు 23 ఏళ్లకే 67 సార్లు భూత వైద్య చేశారట.. ఒంట్లో ఏకంగా ఆరు ఆత్మలు ఉన్నాయట..అసలు ఆ కథేంటో జాగ్రత్తగా చూసేయండి..!

ఈ కథ జర్మనీలో ప్రారంభమైంది. బనారియా నగరంలో నివసించే అన్నలీస్ మిచెల్, ఆమె శరీరంలో 6 ఆత్మలను కలిగి ఉంది. 67 సార్లు భూతవైద్యం చేసినా మిచెల్ ప్రాణాలు కాపాడలేకపోయింది. 23 సంవత్సరాల వయస్సులోనే అన్నలీస్‌ మిచెల్‌ మరణించింది. అన్నాలీస్ మిచెల్ 16 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆమెకు (Temporal Lobe Epilepsy) అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధిలో రోగి క్రమంగా తన జ్ఞాపకశక్తిని కోల్పోతారట..శరీరంపై నియంత్రణ ఉండదు. అన్నలిస్ కుటుంబం మొదట్లో వారి గురువును చూపించింది. కానీ, ఫలితం లేకుండాపోయింది. దాంతో ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఐదేళ్లపాటు వైద్యం అందించినా రోగం నయం కాలేదు. డాక్టర్లు ఇంత సుదీర్ఘ చికిత్స చేసినా ఫలితం లేదు.

అన్నెలీస్ మిచెల్ పరిస్థితిలో ఎటువంటి డవలప్‌మెంట్‌ లేదు. పైగా పరిస్థితి క్రమంగా దిగజారడం ప్రారంభించింది. మిచెల్ వింత పనులు చేయడం స్టాట్‌ చేసింది..ఇది చూసి కుటుంబం సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆ తర్వాత తమ కూతురికి ఎలాంటి జబ్బు లేదని కుటుంబసభ్యులకు అర్థమైనా ఆమెను ఏదో దెయ్యం పట్టుకుందని అనుమానించారు. మిచెల్ ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు భూత వైద్యుడిని ఇంటికి పిలిచారు. ఆస్ట్రోను చూసిన మిచెల్ అక్కడే మలమూత్రాలు చేస్తుంది. పక్కనే ఉన్న బొగ్గు, సుద్ధ ముక్కలు తినడం మొదలేసింది. దాంతో ఆ భూతవైద్యుడు మిచెల్ ముఖంలో ఒక వింత నవ్వును గమనించాడు. ఆమెలో ఏదో దెయ్యాల ఆత్మ నివసిస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పాడు.

ఆ భూతవైద్యుడు మిచెల్‌ని పరీక్షించి..ఆమెకు భూత వైద్యంతో చికిత్స అవసరమని సలహా ఇచ్చాడు. అప్పుడు మిచెల్ తల్లిదండ్రులు ఇద్దరు పూజారులను భూతవైద్యం చేయడానికి పిలిపించారు.. వారు మిచెల్‌ని చూసి ఆమెలో ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఆరు దెయ్యాల ఆత్మలు ప్రవేశించాయని చెప్పారు. ఆ తర్వాత అతడు ఆ ఆత్మలను పారదోలే ప్రయత్నం చేయటం మొదలేశాడు…కానీ, ఇది దయ్యాల ఆత్మలకు కోపం తెప్పించింది. మిచెల్ పరిస్థితి మునుపటి కంటే అధ్వాన్నంగా తయారైంది. భూతవైద్యం తర్వాత కూడా అన్నెలీస్ మిచెల్ పరిస్థితి మెరుగుపడలేదు. దెయ్యాల శక్తులు క్రమంగా ఆమెపై ఆధిపత్యం చేశాయి. మిచెల్ ఇతరులపై దాడి చేయడంతోపాటు తనను తాను చాలాసార్లు గాయపరచుకునేదట.. మిచెల్‌కు మతపెద్దలు 67 సార్లు బలవంతంగా భూత వైద్యం చేశారు. ఆయినా ఆమె కోలుకోలేకపోయింది.

కొద్ది రోజులకు..అన్నాలీస్ మిచెల్ ఆహారం కూడా తీసుకోవడం మానేసింది. ఎందుకు ఇలా చేస్తున్నావని పూజారులు ఆమెను అడిగితే, దెయ్యాల ఆత్మలు తనను ఏమీ తినడానికి, త్రాగడానికి అనుమతించడం లేదని చెప్పిందట… భోజనం మానేయడం వల్ల మిచెల్ పోషకాహార లోపం బారిన పడింది. 1976 జూన్ 30న మిచెల్‌ను చివరిసారిగా మతాధికారులు వెలికితీశారు. ఆమె అలసిపోయిందని, ఈ శరీరాన్ని వదిలించుకోవాలని కోరుకుంటున్నట్లు మిచెల్ చెప్పింది. 21 సెప్టెంబర్ 1952న జన్మించిన మిచెల్ 1976 జూలై 1న 23 ఏళ్ల వయసులో మరణించింది. పాపం ఆమె సైన్స్‌, శాస్త్రానికి చిక్కకుండా సమస్యతో పోరాడీ పోరాడీ చనిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news