98 ఏళ్ల వయసులో జిమ్నాస్టిక్స్‌ చేస్తు అదరగొడుతున్న బామ్మ

-

98 ఏళ్ల వయసు వచ్చేసరికి చాలా మంది తమ పనులు తాము చేసుకోలేరు. కనీసం అడుగు తీసి అడుగు వేయలేరు. కానీ ఈ బామ్మ మాత్రం 98 ఏళ్ల వయసులో జిమ్నాస్టిక్స్‌తో అదరగొడుతుంది. ఆమెను చూస్తే ఎవరూ కూడా వృద్ధురాలు అనుకోరు. ఈ బామ్మ ఎంతో మందికి ఆదర్శం.. అసలు ఈ వయసులో ఇదేలా సాధ్యం.. తన హెల్త్‌ రహస్యం ఏంటి..?
రికార్డులు బద్దలు కొడుతోంది ఈ బామ్మ! ఈమె పేరు జోహన్నా క్వాస్, రికార్డులను బద్దలు కొట్టి, తన ఎత్తుగడలను ప్రదర్శిస్తోంది. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ బామ్మ వీడియోలు చూసి నమ్మలేకపోయాడు! ఈమె 1925 నవంబర్‌ 20న జన్మించారు. 98 ఏళ్ల జోహన్నా తన 10 ఏళ్ల నుంచి ఈ జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలో ఉంది. దాదాపు ఒక శతాబ్దం పాటు ఆమె అలానే మెలికలు తిరుగుతోంది. ఆమె నైపుణ్యానికి తగిన క్రెడిట్, జోహన్నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది. ఇప్పటికీ రోజు ప్రాక్టీస్ చేస్తుందట.
ఈమె వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యముగ్దులైనారు. ఆమెకు 98 ఏళ్లు అంటే మేము నమ్మం అని ఒకరు కమెంట్‌ చేస్తుంటే.. ఆమెను చూస్తుంటే నేను షేమ్‌ ఫీల్‌ అవతున్నాను.. నేను ఏం చేయలేకపోతున్నాను ఇంకొక నెటిజన్‌ అంటున్నారు. ఆమె 20-30 ఏళ్ల మధ్య ఉంటుందేమో అని ఇంకొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈమె గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే… johanna quaas అని గూగుల్‌లో సర్చ్‌ చేయండి. ఈమె జిమ్నాస్టిక్‌ వీడియోస్‌ అన్నీ కనిపిస్తాయి. అసలు ఈ వయసులో ఆ బామ్మ దుమ్మరేగొడుతుంది. మన హీరోలు 60 ఏళ్లు వచ్చినా చెక్కు చెదరని అందం మెయింటేన్‌ చేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటాం. ఈమెను చూస్తే.. అది చాలా చిన్న విషయమే అనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Siim Land (@siimland)

Read more RELATED
Recommended to you

Latest news