స్పెషల్ కేఫ్: వ్యాపారం చేయడానికి జనాలకు కొన్నిసార్లు మరీ వెర్రి ఐడియాలు వస్తాయోమో కదా..! ఇలా కూడా చేస్తారా..? అనిపించేలా..? ఇక్కడ ఓ యువకుడు ఒక కేఫ్‌ను ఏర్పాటు చేశాడు.. కేఫ్ పెట్టడంలో తప్పు ఏం ఉంది అనుకుంటున్నారేమో.. ఆ కేఫ్‌లో.. టీలు, కాఫీలుకాదు.. ముద్దు ముచ్చట్లు ఉంటాయి.. గంటకు రూ. 99 తీసుకుంటూ.. ప్రేమికుల కోసం ఏకంతంగా గడిపేందుకు క్యాబిన్ ఏర్పాటు చేశాడు. అంతా బానే ఉంది.. బిజినెస్‌కు ప్రమోషన్ ఇస్తే.. బాగా డబ్బులు వస్తాయి అనుకోని.. ఓ వీడియో తీసి నెట్టింట వదిలాడు.. అది కాస్త వైరల్ అయింది.. మనోడి బాగోతం బయటపడింది.. సీన్‌కట్ చేస్తే.. కేఫ్ మూత పడింది..! ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఛత్రిపుర పోలీస్టేషన్‌కి కొంత దూరంలో బ్లూ బాటిల్ కేఫ్ పేరుతో ఓ యువకుడు కేఫ్‌ని ఏర్పాటు చేశాడు. అందులో ఇద్దరు వ్యక్తులు కూర్చొని రహస్యాలు మాట్లాడుకోవచ్చు, మనసు విప్పి మాట్లాడుకునే విధంగా ప్రేమికుల కోసం క్యాబిన్స్ డిజైన్ చేయించాడు. వాటిని ఒక్కొక్క గంటకు 99రూపాయల చొప్పున ప్రేమజంటలకు అద్దెకిస్తున్నాడు. బ్లూ బాటిల్ కేఫ్ చాలా కాలంగా అదే ప్రాంతంలో నడుస్తుంది… ప్రేమికులు కలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావించిన నిర్వాహకుడు అది అందరికి తెలియాలని ఓ వీడియో రూపొందించాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభ్యంతరాలు మిన్నంటాయి.
అసలు అతను రూపొందించిన వీడియోలో ఏముందంటే .. ఒక యువకుడు ఒక మహిళ బహిరంగ ప్రదేశంలో కూర్చుని చర్చించుకుంటారు. ఇంతలో వాళ్లు ముద్దు పెట్టుకుందాం అనుకుంటారు.. అయితే దీని కోసం యువకుడు అటు ఇటూ చుస్తాడు.. అతను లిఫ్ట్‌కి వెళ్తాడు. కానీ అక్కడకు మరొకరు కూడా వస్తారు. ఆ తర్వాత ఇద్దరూ ఆటో ఎక్కారు. ఇక్కడ ఆటో డ్రైవర్ వారిని చూస్తూనే ఉన్నాడు. ఇంతలో వారికి చెప్పిన కేఫ్ గురించి సమాచారం వస్తుంది. 99 రూపాయలకే క్యాబిన్ అందుబాటులో ఉంది. ఇందులో ప్రేమ జంట తమ ప్రైవేట్ క్షణాలను కలిసి గడపవచ్చు. మీరు మీ కాలక్షేపం చేయవచ్చని కేఫ్ యొక్క ఈ సదుపాయం వీడియోలో ప్రచారం చేశాడు. ఇదంతా ఓ సోషల్ మీడియా ఆర్టిస్ట్ ద్వారా చిత్రీకరించాడు.
ఆ వీడియో కాస్త వైరల్ అయింది.. స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పోలీసులు హడావిడిగా కేసు నమోదు చేశారు. ఛత్రిపుర పోలీసులు కేఫ్ నిర్వాహకుడ్ని స్టేషన్‌కు పిలిపించారు. అతను కేఫ్‌కు తాళం వేసి పరారయ్యాడు. దాంతో అతడ్ని వెదికి మరీ పట్టుకున్నారు. కేఫ్ కాస్తా మూతపడింది.. అయితే.. పాపం ఆ కేఫ్ నిర్వాకుడు.. ప్రేమికుల కోసం ఏకాంతంగా గడిపేందుకు ఒక కేఫ్‌ను ఏర్పాటు చేయాలనుకున్నాడు.. కానీ అది అందుకు మాత్రమే ఉపయోగపడుతుంది అని తెలులుకోలేకపోయాడేమో..!!