చైనా పుణ్యమా అంటూ మొన్నటి వరకూ కరోనా వైరస్ ప్రజలను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టింది.అంతేకాదు ప్రాణాలను కూడా తీసేసింది.పలు వేరియంట్లతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే.. ప్రజలను గడగడలాడించిన కరోనా గబ్బిలాల నుంచి జంతువులకు ఆ తర్వాత మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. గబ్బిలాలతో జగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు చేశాయి. అయినా.. ఆ ప్రమాదకర విషయాన్ని బేఖాతరు చేస్తూ థాయిలాండ్‌కు చెందిన ఓ యువతి.. వాటినే తింటూ ఎంజాయ్ చేసింది.
చనిపోయిన గబ్బిలాలతో కూడిన బ్యాట్ సూప్ తాగుతూ.. వాటిని తుంచుకుని తింటూ వీడియోను పోస్ట్ చేసింది..
ఆ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు వెంటనే ఆ వీడియోను చూసి ఆ యువతిని అరెస్ట్ చేశారు.ఫోంచనోక్ శ్రీసునక్లువా అనే యువతి ఇటీవల తన యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్‌లో.. ఈ వీడియోను పోస్ట్ చేసింది.వీడియోను సోమవారం తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయడంతోపాటు ఈ ఆహారం రుచిగా ఉందంటూ వర్ణించింది. మొదటిసారి తాను ఈ జీవులను తింటున్నానని.. ఉత్తర థాయ్‌లాండ్‌లోని లావోస్ సరిహద్దు సమీప మార్కెట్ నుంచి గబ్బిలాలను కొనుగోలు చేసినట్లు వీడియోలో తెలిపింది.
అయితే, బ్యాట్ గోళ్లు ఎలుక వాసనతో ఉన్నాయని, చర్మం జిగురుగా ఉందని ఆమె చెప్పింది. తన ప్రాంతంలోని నివాసితులు కూడా గబ్బిలాలు తింటున్నందున, తాను ఎలాంటి కరోనా వైరస్‌ను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించడం లేదని ఆమె చెప్పడం విశేషం..ఈ నేరానికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, లేదా 5 లక్షల బాత్ ( $13,800) వరకు జరిమానా విధించే అవకాశముందని పేర్కొంటున్నారు..మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడంతో అందరు ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆమెను అలా వదలకుండా జైల్లోనే ఉంచాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..