ఇప్పటి దాకా వర్షం కురవని వింత గ్రామం ఉంది. ఎప్పుడైనా విన్నారా…? ఆశ్చర్యంగా ఉంది కదా..? పుడమి అంటేనే అద్భుతాలకు పుట్టిల్లు. ఈ అద్భుతమైన పుడమి లో ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. ఇది ఏమి కొత్త కాదు. సాధారణంగా ఒక సారి కాకపోతే మరొక సారి మనకి వాన కురుస్తుంది కానీ ఒక గ్రామంలో మాత్రం ఇప్పటి దాకా అసలు వర్షము కురవలేదట.
చాలా వింతగా ఉంది కదా…? నిజమండి నిజంగా ఒక ఊరు వుంది. మరి ఆ వింతైన ప్రదేశం గురించి ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేయండి. అసలు వర్షమే కురవని ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధానికి పశ్చిమాన ఉంటుంది. ఈ గ్రామం భూమికి 3200 మీటర్ల ఎత్తు లో ఉన్న ఒక కొండ పై ఉంది.
అయితే అసలు ఇక్కడ ఎందుకు వాన కురవదు అనే విషయానికి వస్తే….. అంత ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం మేఘాల కంటే ఎత్తు లో ఉంటుందట. మేఘాల కంటే ఎత్తులో ఉండటం వలన ఈ ప్రాంతంలో అసలు వర్షాలు కురవవు. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా ఉదయం పూట ఎండగా రాత్రి సమయంలో చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చూడడానికి టూరిస్టులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. వినడానికి భలేగా వుంది కదా ఈ వింత గ్రామం.