ఆ ఊళ్లో అమ్మాయి పుడితే.. శిక్ష ఏంటో తెలుసా…?

-

అది రాజస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామం. అక్కడ ఆడపిల్ల పుడితే.. తల్లిదండ్రులకు శిక్ష వేస్తారు. కానీ ఆ శిక్ష ఈ ప్రపంచానికి మేలు చేసేదిగా ఉండటం విశేషం. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని పిప్లాంత్రి గ్రామం మాజీ సర్పంచ్ శ్యామ్ సుందర్ పలవాల్ ఆడపిల్లలకు, నీటికి, చెట్లకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తారు. ఆ ఊళ్లో ఏ ఇంట్లో ఆడపిల్ల జన్మించినా 111 మొక్కలు నాటే సంప్రదాయంగల గ్రామంగా పిప్లాంత్రి ప్రసిద్ధిగాంచింది.

ఈ సంప్రదాయం వెనుక ఓ విషాద గాధ కూడా ఉంది. 2008లో తన పది హేడు సంవత్సరాల కుమార్తె కిరణ్ డీ హైడ్రేషన్ తో మరణించాక, ఆమె జ్ఞాపకార్ధం ముందుగా తాను కొన్ని మొక్కలు నాటాడు. ఇదే పనిచేయాల్సిందిగా ఇతరులను ప్రోత్సహిం చాడు. అమ్మాయి పుట్టినందుకు సెలబ్రేట్ చేసుకోవడమే కాక, పర్యావరణాన్ని పరిరక్షించినట్లు కాగలదన్నది అతని అభిప్రాయం.

ఈనాడీ గ్రామం మూడు లక్షల పై చిలుకు చెట్లతో, ఎడారి నడుమ పచ్చని ఒయాసిస్సు మాదిరి అలరారుతోంది. ఎనిమిదిన్నరవేలమంది జనాభా గల ఈ గ్రామంలో సగటున ఏడాదికి అరవైమంది ఆడపిల్లలు పుడుతుంటారు. ప్రతి ఆడపిల్ల పుట్టినప్పుడు నూటపదకొండు మొక్కలు నాటడమే కాకుండా ఆమె పేరు మీద 21 వేల రూపాయలు ఫిక్స్ డ్‌ డిపాజిట్ చేస్తారు. స్వంత కుటుంబము నుంచి తమ తమ ఆర్థిక పరిస్థితిని అనుసరించి వెయ్యి నుంచి పదివేల రూపాయలు వెచ్చిస్తారు.

ఈ మొత్తం ఆ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాక మాత్రమే తీసుకోవాల్సివుంటుంది. ఆమె చదువుకు మాత్రమే ఈ మొత్తాన్ని వినియోగిస్తామని కుటుంబం అఫిడవిట్ ఇవ్వాలి. అలాగే ఆమె పేరు మీద నాటిన మొక్కల పెంపకం బాధ్యత కుటుంబ సభ్యులు తీసుకుంటారు. ‘ఇలా నాటిన మొక్కలకు మతపరంగానూ ప్రాముఖ్యం వుంటుంది. వీటిని ఎవ్వరూ నరకడం, వంట చెరకుగా వాడడం చెయ్యరు. మామిడి చెట్టును పవిత్రంగా భావిస్తారు. ఈ ఆచారం వింతగా ఉంది కదూ.

Read more RELATED
Recommended to you

Latest news