వన్ ప్లస్ సిరీస్ లో తాజాగా వచ్చిన ఫోన్ వన్ ప్లస్ 7టీ. ఈ సంవత్సరం మేలో విడుదలైన వన్ ప్లస్ 7కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ ను విడుదల చేశారు. అయితే తాజాగా వన్‌ప్లస్ 7 సిరీస్‌లో వచ్చిన వన్ ప్లస్ 7టీకి కొనసాగింపుగా ‘వన్ ప్లస్ 7టీ ప్రొ’ పేరుతో మరో కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. ఈనెల 10న లండన్ లో నిర్వహించే ఈ వెంట్‌లోలాంచ్ చేయనుంది. భారతదేశంలో కూడా అదే రోజు ఆవిష్కరించనుందని అంచనా. ఇక అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది.
ఇక ఫీచర్ల విషయానికి స్తే వన్ ప్లస్ 7టీ మాదిరిగానే వన్ ప్లస్ 7టీ ప్రో ఫీచర్లు ఉండనున్నాయట. ఈ క్రమంలో నాచ్ లేని అమోఎల్ఈడీ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, పాపప్ సెల్ఫీ కెమెరా ఫీచర్లు ఉండనున్నాయని టెక్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. వన్ ప్లస్ 7ప్రోతో పోలిస్తే మరింత మెరుగైన కెమెరాలు ఇందులో అందించనున్నారని తెలుస్తోంది. ఇక అత్యంత శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్, 4,080 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ప్రారంభ ధర సుమారు రూ.49,999 ఉండనున్నట్టు అంచనా వేస్తున్నారు.