ఆర్టీసీ ఉద్యోగులకు ఇక వేటు త‌ప్ప‌దు..

-

ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరించాలని, సంస్థలో క్రమశిక్షణను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 6 గంటలల్లోపు విధుల్లో చేరకపోతే వేటు తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించిన విష‌యం తెలిసిందే. అలాగే ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలోనే విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

అయితే సాయంత్రం 6 గంట‌ల డెడ్‌లైన్ ముగిసినా ఇంత వరకు ఒక్క కార్మికుడు కూడా విధుల్లో చేర‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సాయంత్రం 6 గంటలల్లోపు విధుల్లో చేరకపోతే వేటు తప్పదని మ‌రో సారి ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించినా ప్ర‌యోజ‌నం లేదు. ఇకపై కార్మికసంఘాలతో చర్చలు జరపవద్దని, ప్రభుత్వం నియమించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కమిటీని ప్రభుత్వం రద్దు చేసింది. రవాణాశాఖ కమిషనర్‌గా సందీప్‌ సుల్తానియా నియామించారు. మ‌రియు తాత్కాలిక ప్రాతిపదికన 6 వేల నియామకాలు ఆర్టీసీ చేపట్టింది. 4 వేల మంది డ్రైవర్లు, 2 వేల మంది కండక్టర్ల నియామకం చేపట్టనున్నారు. ఆదివారం నుండి పూర్తిస్థాయిలో బస్సుల్ని నడుపుతామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news