ఈషా పెళ్లికి ఖరీదైన గిఫ్ట్.. ఎవరిచ్చారో తెలుసా?

-

All eyes on Isha Ambani’s new 50,000 sq ft multi-million dollar mansion

విరుష్క, సోనమ్ కపూర్ అండ్ ఆనంద్ అహుజా, దీప్‌వీర్, నిక్యాంకను వదిలేశారు జనాలు. ఇప్పుడు ఈషా, ఆనంద్ పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. వాళ్ల పెళ్లి అయిపోయింది. వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగడమే కాదు.. పలు ప్రముఖులు హాజరై వాళ్లను దీవించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఇప్పుడు ఈషా అంబానీకి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అది ఈషా పెళ్లి గిఫ్ట్. తన అత్తగారు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ అది. అంటే ఆనంద్ పేరెంట్స్ అన్నమాట. 50 వేల స్కైర్ ఫీట్లు ఉన్న మల్టీ మిలియన్ డాలర్ల విలువైన బంగ్లాను ఈషా, ఆనంద్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. అది ముంబైలోని వర్లీలో ఉంది. ముకేశ్ అంబానీ ఇల్లుకు దగ్గర్లోనే అది కూడా ఉందట. కొద్దిరోజుల్లోనే ఆ బిల్డింగ్‌కు ఈషా, ఆనంద్ షిఫ్ట్ అవనున్నారట. ఆ బిల్డింగ్‌కు గలిటా అని పేరు పెట్టారట. మీరు పైన ఫోటోలో చూస్తున్న బిల్డింగ్ అదే.

Read more RELATED
Recommended to you

Latest news