ఆహారం లేకుండా ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేరు.. ఎంత కఠినమైన డైట్ పాటించినా..రోజులో ఒక్కసారైనా అన్నంతినకపోతే ఉండలేం.. ఒకటి లేదా రెండు రోజులు అంతే..అంతకుమించి ఎవరైనా ఆహారం లేకుండా ఉండగలుగుతారా.. ? కానీ ఆ బామ్మ మాత్రం 50 ఏళ్లుగా భోజనం చేయకుండానే బతికేస్తుంది. అంటే తినడానికి లేక అలా ఉంటుందేమో అనుకునేరు..అలా ఏం కాదు.. 50 ఏళ్లుగా కేవలం లిక్విడ్ ఐటమ్స్ తీసుకుంటూనే ఉంది. అయినా మాత్రం..వీక్‌గా లేదు. మంచి స్ట్రాంగ్‌గా అందంగా ఉంది.. బామ్మ అన్ని రోజులు భోజనం లేకుండా ఎలా ఉండగలిగింది.. సీక్రెట్ ఏంటో..?
పశ్చిమబెంగాల్లోని ఓ బామ్మ ఏకంగా 50 ఏళ్లుగా భోజనం చేయకుండానే జీవిస్తున్నారు. ఆహారం తినకుండా బతకడం అసలు సాధ్యమవుతుందా..? ఆమె కేవలం టీ, హార్లిక్స్, కొన్ని హెల్త్ డ్రింక్స్ తాగుతూ గడిపేస్తున్నారు. హుగ్లీలోని గోఘాట్ జిల్లా షంబజార్ పంచాయతీ పరిధిలోని బెల్దిహా గ్రామానికి చెందిన అనిమా చక్రబర్తి అనే వృద్ధురాలు ఇలా జీవిస్తోంది. ఆమె వయసు ఇప్పుడు 76ఏళ్లు.
అనిమా చక్రబర్తి దాదాపు 50 నుంచి నుంచి ఎలాంటి ఘన పదార్థాలు తినకుండా బతుకుతున్నారు. కేవలం టీ సహా కొన్ని ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయినా కూడా ఆమె అందరిలాగే ఆరోగ్యంగా సాధారణ జీవితం గడిపేస్తున్నారు.. గతంలో ఇంట్లో పరిస్థితులు బాలేకపోవడం వల్లే ఆహారం తినకుండా కేవలం ద్రవపదార్థాలతో జీవించడం అలవాటు చేసుకున్నారని అనిమా కుమారుడు తెలిపారు. పనికి వెళ్లగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేదని, ఆమె మాత్రం టీ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుని సరిపెట్టుకునేవారని, అదే అలవాటుగా మారిందని చెప్పారు.
వృద్ధురాలు ఆహారం తినకుండా జీవించడంపై అక్కడి స్థానికులు కూడా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అనిమాను చూస్తున్నానని, ఆమె ఎప్పుడూ ఘన ఆహారం తీసుకోవడం చూడలేదని, కేవలం టీ ఇతర ద్రవ పదార్థాలే తీసుకుంటారని చెప్పారు. తమ గ్రామంలో ఇలాంటి మహిళ ఉండడం తమకు ఎంతో గర్వ కారణంగా ఉందని గ్రామస్థులు అంటున్నారు.
ఇది సాధ్యమే..
అనిమా చక్రబర్తి లైఫ్‌స్టైల్‌పై హుగ్లీకి చెందిన బిల్లేశ్వర్ బల్లవ్ అనే డాక్టర్ మాట్లాడుతూ..‘మన శరీరం రోజువారీ విధులు నిర్వర్తించడానికి శక్తి, కేలరీలు, పోషకాలు అవసరం. తినే ఆహారం ఘన పదార్థమైనా, ద్రవ పదార్థమైనా అందులో పోషకాలు ఉంటే చాలు.. శరీరంలో సాధారణ శ్వాస, జీర్ణ ప్రక్రియలు నడవడానికి సహకరిస్తాయి. కణాలకు అవసరమైన మొత్తం శక్తి అంటే కేలరీలు ద్రవ పదార్థం నుంచైనా తీసుకుంటే సమస్య ఉండదు’ అని డాక్టర్ పేర్కొన్నారు. ఇది మరీ ఆశ్యర్యకరమేమీ కాదని, కోమాలో ఉన్న వారు లేదా చాలా కాలం అనారోగ్యంతో బాధపడుతున్న వారిని శరీరానికి సరిపడా ద్రవాలను అందించడం ద్వారా బతుకుతారని తెలిపారు..
ఏది ఏమైనా ఇన్ని ఏళ్లుగా ఆహారం తినకుండా ఉండటం అనేది చాలా అరుదైన విషయం.. పరిస్థితులు బాలేనప్పుడు చేసింది..కానీ ఇప్పుడు వారి కుటుంబం పరిస్థితి మెరుగ్గానే ఉంది.. అయినా కూడా ఆమె అలానే ఏం తినకుండా ఉండిపోయింది.