చాలామంది ఆల్కహాల్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మానేయాలి అనుకున్నా కూడా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు నిజానికి ఆల్కహాల్ ని తీసుకోవడం వలన ఒక పక్క లైఫ్ మరొకపక్క ఆరోగ్యం రెండు పాడవుతాయి. అందుకని వీలైనంతవరకు ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది. మీరు కూడా ఆల్కహాల్ కి బాగా అలవాటు అయిపోయినట్లయితే ఇలా చేయండి ఈ విధంగా ఫాలో అయితే ఆల్కహాల్ నుండి బయటపడవచ్చు. మీరు రోజుకి ఎన్ని పెగ్గులు తాగుతున్నారో చూసుకోండి. మీరు ఆల్కహాల్ ని తగ్గించుకోవడానికి చూసుకోండి.
రోజు ఒక లిమిట్ ని పెట్టుకుని అంతవరకే తాగండి లిమిట్ దాటి తాగకండి. ఈరోజు రెండు ఆల్కహాల్ ని తీసుకుంటూ ఉంటారు ఒత్తిడి ఎక్కువైనట్లయితే ఇతర మార్గాలు కూడా ఉన్నాయి వ్యాయామం చేయడం వంటివి చేస్తే ఆల్కహాల్ కి దూరంగా ఉండొచ్చు ఒత్తిడి తగ్గిపోతుంది కాబట్టి ఆల్కహాల్ తీసుకోవాలని మీకు అనిపించదు. ఆల్కహాల్ కి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు ఆల్కహాల్ ని ఇంట్లోకి తీసుకురాకండి. ఇంట్లో కనపడక పోతే తాగలేరు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి.
మద్యాన్ని దూరం పెడదామని అనుకుంటే తాగడానికి గల కారణాన్ని తెలుసుకోండి వేరే మార్గం ద్వారా దానిని పరిష్కరించుకోండి ఇలా ఈ విధంగా కూడా మీరు ఆల్కహాల్ కి దూరంగా ఉండొచ్చు. తాగే ముందు తాగుతున్నప్పుడు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే ఆల్కహాల్ తాగడానికి కుదరదు. ఆల్కహాల్ తాగి విసిగిపోయి అలవాటుని దూరంగా పెట్టాలని అనుకునే వాళ్లతో మీరు చెలిమి చేయండి అప్పుడు కచ్చితంగా సపోర్ట్ లభిస్తుంది. చాలామంది ఒంటరితనం వల్ల మద్యం కి అలవాటు పడిపోయారు అది నిజంగా చాలా ప్రమాదం స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపితే కూడా ఆల్కహాల్ కి దూరంగా ఉండొచ్చు ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో ఆల్కహాల్ కి దూరంగా ఉండొచ్చు.