చికెన్‌ను ట్యాప్‌ కింద వాటర్‌తో క్లీన్‌ చేస్తున్నారా..? డేంజరే..!

-

సండే వచ్చిందంటే..చికెన్‌, మటన్‌ ఏదో ఒకటి తెచ్చుకోని తింటాం. అయితే ఎవరి ఇళ్లళ్లో అయినా.. చికెన్‌ తేగానే..దాన్ని షింక్‌లో ట్యాప్‌ కింద పెట్టి బాగా క్లీన్‌ చేస్తుంటారు..ఉప్పు, పసుపు వేసి కూడా కడుగుతారు..ఇలా క్లీన్‌ చేయడం డేంజర్‌ అంటున్నారు నిపుణులు.. అదేంటి..చికెన్‌ క్లీన్‌ చేయడం తప్పా.. అని డౌట్‌ వస్తుందా..?

చికెన్‌ను ట్యాప్ వంటి నీటి ధార కింద పెట్టి కడగడం వల్ల.. ఆ తుంపర్లు వంట గది అంతా చిమ్ముతాయి. వాటి ద్వారా కాంపైలో బాక్టర్, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల అనేక వ్యాధులు వస్తాయని.. అందువల్ల చికెన్‌ను నీటి ధార కింద కడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నిపుణులు ఈ విషయంపై ప్రజలను హెచ్చరించారు. అయినప్పటికీ చాలా మంది మానుకోవడం లేదు. ట్యాప్ కిందే కడుగుతున్నారు. మీరు అనుకుంటారు.. మేం జాగ్రత్తగానే కడుగుతున్నాం..నీటి తుంపర్లు పడటం లేదూ అని..కానీ కంటికి కనిపంచని తుంపర్లు చాలా ఉంటాయి..అసలు వంటగదిలో కాకుండా..బయట ఉండే ట్యాప్స్‌ కింద కడిగితే ఏ గోలా ఉండదు.

ఇటీవల ఆస్ట్రేలియా ఫుడ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ జరిపిన సర్వేలో ఇది మరోసారి రుజువయింది. ఆస్ట్రేలియాలో చాలా మంది నీటి ధార కింద చికెన్‌ను కడిగి.. వ్యాధుల బారినపడ్డారట. ఆస్ట్రేలియాలో సగం మందికి పైగా జనాభా కోడి మాంసాన్ని నీటి ధార కింద కడుగుతున్నారు. దీని వల్ల గడిచిన 20 ఏళ్లలో ఆస్ట్రేలియాలో కాంపైలోబాక్టర్, సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్లు రెట్టింపు అయ్యాయని అక్కడి వైద్యులు తెలిపారు. అందువల్ల ఈ అలవాటను మానుకోవాలని సూచిస్తున్నారు.

ఈ రోజుల్లో అత్యాధునిక మార్గాల్లో చికెన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అందువల్ల దానిని మళ్లీ ప్రత్యేకంగా కడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కడగాలని అనిపిస్తే.. నీటి ధార కింద కాకుండా.. ఓ గిన్నెలో నీళ్లు పోసుకొని కడగాలి. కొందరు చికెన్‌లో వెనిగర్, నిమ్మరసం వంటివి వేసి శుభ్రం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా కూడా బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశముందని తెలిపారు. అందువల్ల చికెన్ కడిగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version