ఒత్తిడి ఎక్కువగా ఉందా? ఐతే ఈ ఆహారాలని ముట్టుకోవద్దు..

ఒత్తిడి అనేది నిత్యజీవితంలో భాగమై పోయింది. అమ్మో నాకు చాలా టెన్షన్స్, నేను కాబట్తే ఇదంతా చూసుకుంటున్నాను. వేరే వాళ్ళు ఇంత ఒత్తిడి తట్టుకునే వాళ్ళు కాదని ఒత్తిడిని గ్లామరైజ్ చేసే వాళ్ళు కనబడుతుంటారు. వారికి అలా బాగనిపిస్తుందేమో గానీ, దీర్ఘకాలం అలాగే ఉంటే ముప్పు తప్పదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏ ఆహారాలని తీసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కువ మంది ఇక్కడే తప్పు చేస్తారు. కొంచెం ఒత్తిడిగా ఫీలయితే చాలు కాఫీ, టీ అని పరుగులు తీస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఒత్తిడి ఇబ్బంది పెడుతుంటే ఏ ఆహారాలని ముట్టుకోవద్దో ఇక్కడ చూద్దాం.

కాఫీ

కాఫీ మంచిదే. కానీ రెండు కప్పుల కంటే ఎక్కువ తాగడం కరెక్ట్ కాదు. దానివల్ల ఒత్తిడి మరింత పెరిగే అవకాశమే ఎక్కువ.

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసంలో సల్ఫేట్లు ఉంటాయి. అవి శరీరానికి హాని కలుగజేస్తాయి. అందుకే వాటిని ముట్టకుండా ఉండడమే బెటర్.

చక్కెర

చక్కెర మన మూడ్ ని విపరీతంగా ప్రభావం చూపుతుంది. ఒత్తిడిగా ఫీల్ అయితే చక్కెర పదార్థాలకి దూరంగా ఉండండి.

ఆల్కహాల్

శరీర వ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. బాధల్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ తాగితే అందులో నుండి ఉపశమనం లభిస్తుందని చెప్పుకుంటారు గానీ, అది నిజం కాదు. తాగుతున్నంత సేపు ఆ బాధ మర్చిపోయి తూలుతుంటారేమో కానీ, ఆ తర్వాత అది మనసుపై బాగా ప్రభావం చూపి మరింత ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది.

కృత్రిమ తీపి కారకాలు

కృత్రిమ తీపి కారకాలు శరీరానికి చేటు చేస్తాయి. శరీర వ్యవస్థని అస్తవ్యస్థం చేసి శక్తిని బాగా తగ్గిస్తాయి.