మీరు ప్రేమకోసం తపించిపోతున్నారా? ఇలా చెక్ చేసుకోండి..

-

ప్రేమ.. ఈ సమస్త ధరిత్రి ఇలా నడుస్తున్నదంటే దానికి కారణం ప్రేమ. ప్రేమే గనక లేకపోతే మనిషి ఇక్కడిదాకా వచ్చేవాడే కాదు. ఆదిమానవులతోనే మానవ జాతి అంతమై ఉండేది. నేను నుండి మొదలుకుని నా పిల్లలు, నా కుటుంబం, నా ఊరు, నా ప్రపంచం అన్న విధాలుగా ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుంది. ఎవరు దేన్ని ఎందుకు ప్రేమిస్తున్నారనేది వాళ్ళకు సంబంధించిన విషయం. ఐతే మీరు ప్రేమకోసం తపించిపోతున్నారా? ప్రేమ లేక విలవిలలాడిపోతున్నారా అన్నది కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.

ప్రేరణ కోరుకోవడం

ఈ పని వీళ్లకోసం చేస్తే బాగుంటుంది. వీళ్ళు నాకు స్ఫూర్తిగా నిలిస్తే ఇంకా బాగా పనిచేయగలను అని మీకనిపిస్తూ ఉంటే మీరు ప్రేమ కోసం బాగా వెతుకుతున్నారని అర్థం. ప్రేమ ప్రేరణ ఇస్తుంది. ఆ ప్రేరణతో జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు.

మాటి మాటికీ చిరాకు పడడం

చిరాకు కలగడానికి చాలా కారణాలుంటాయి. అది ప్రేమ కోసమే అని తెలియాలంటే మిమ్మల్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. మీ జీవితంలో హాయిగా నవ్వుకుని ఎంతకాలం అయ్యిందన్న దగ్గర నుండి అవతలి వారికి ఏదైనా సాయం చేసానా అన్న విషయం వరకు మిమ్మల్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాలి.

మిమ్మల్ని మీరు అసహ్యించుకోవడం

ప్రేమ రాహిత్యంతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తామేదీ చేసినా నా వల్ల ఇలా జరగాల్సింది కాదనో, లేక నేనిలా ఎందుకు చేసాననో బాధపడుతుంటారు. నా జీవితం ఎందుకు? ఎవరికోసం బ్రతకాలి అన్న ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. జీవితంలో ప్రేమ లేకపోవడం వల్ల కలిగే ఆలోచనలే ఇవి.

తమని తాము ప్రేమించుకోరు

ముందే చెప్పినట్టు తమని తాము అసహ్యించుకుంటూ ప్రేమకి దూరంగా ఉంటారు. కానీ, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తమని తాము ప్రేమించుకోలేని వారు ఇతరులని ప్రేమించరు. అలాగే తమని తాము ప్రేమించుకోలేని వారిని ఇతరులు ప్రేమించడానికి ఇష్టపడరు.

Read more RELATED
Recommended to you

Latest news