మీ పిల్లల్లో నమ్మకాన్ని పెంచాలంటే ఈ ప్రశ్నలు వెయ్యండి..!

-

మనం పిల్లల్ని ఎలా పెంచుతామో వాళ్ళు అదే విధంగా భవిష్యత్తులో నడుచుకుంటారు కాబట్టి పిల్లల్ని పెంచే విధానం లో తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి. ప్రతి రోజు పిల్లల్ని ఇలాంటి ప్రశ్నలు వేసి వాళ్లలో నమ్మకాన్ని పెంచొచ్చు. మరి అది ఎలా అనేది తెలుసుకుందాం. ఇలా కనుక తల్లిదండ్రులు చేసారంటే కచ్చితంగా పిల్లల్లో నమ్మకం పెరుగుతుంది.

 

ఇతరులతో పోల్చుకుంటే నీవు ఎందులో స్పెషల్:

ఇతరులతో పోల్చుకుంటే నీవు ఎందులో స్పెషల్. ఎందులో ప్రత్యేకంగా ఉన్నావు అని తల్లిదండ్రులు అడగాలి. దాంతో పిల్లల్లో నమ్మకం పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా కొత్త వాటిని ప్రయత్నం చేయడానికి కూడా అవుతుంది.

ఎప్పుడు ఎక్కువ ధైర్యంతో ఉన్నావు:

ఎప్పుడు ఎక్కువ నీకు ధైర్యంగా అనిపించింది. ధైర్యంతో ఉన్నావు అని కూడా అడిగితె కూడా వాళ్ల నమ్మకాన్ని పెంచేందుకు సహాయపడుతుంది.

ఇతరులకి నీవు ఏమి నేర్పగలవు:

ఈ ప్రశ్న కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇతరులకు ఏం నేర్పగలవు అని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నించాలి. అప్పుడు పిల్లలు కూడా వాళ్ళ సామర్థ్యాలను పెంపొందించుకోవాలి అని అనుకుంటారు.

ఎప్పుడైనా దేనికోసమేనా భయపడ్డవా:

ఎప్పుడైనా దేనికోసమేనా భయపడ్డవా నీవు అని కూడా ప్రశ్నించండి. అప్పుడు పిల్లలు చెప్పేది విని మీరు ఆ భయాన్ని పోగొట్టండి. ఇలా చేస్తే కూడా వాళ్ళు వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news