సముద్రం మధ్యలో వేలిముద్రలాంటి “ద్వీపం”..14 ఎకరాల్లో ఉందా అద్భుతం

-

ప్రకృతిని ప్రేమించాలేకానీ..అది మనకు చాలా ఇస్తుంది. అందమైన జలపాతాలు, మంచుపర్వతాలు, అడవులు, లోయలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని ఐలాండ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే..ఐలాండ్ కూడా అలాంటిదే.. బాల్జెనాక్ ద్వీపంగా పిలువబడే ఈ ఐలాండ్, క్రొయేషియా దేశ సముద్ర భాగంలోని షిబెనిక్ ద్వీపసమూహంలో ఉంది. డ్రోన్ వ్యూలో చేస్తే..అచ్చం “బొటనవేలిముద్రలా” కనిపించే ఈ బుల్లి ద్వీపం ఇప్పుడు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. కేవలం 1.30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈబొటనవేలి ద్వీపం ఎక్కడుందో..ఏంటో చూద్దాం.

సుమారు 200 ఏళ్ల క్రితం ఈ ద్వీపంలో పంటలు పండించడం, వైన్ తయారు చేయాడం వంటి పనులు చేసేవారట. అయితే ఈ ద్వీపం.. సముద్ర మధ్యలో ఉండడంతో అప్పుడప్పుడు పెద్ద అలలు వచ్చి పంటలను నాశనం చేస్తుండడంతో..ఇలా రాళ్లు పేర్చి, బంక మట్టితో గట్టిగా కట్టలు కట్టారు అప్పటి ప్రజలు. కొన్నేళ్లకు ఇక్కడ పనులు చేయడం ఆగిపోగా, ఆ కట్టలు మాత్రం అలానే ఉండిపోయాయి. అలా 14 ఎకరాల్లో చుట్టూరా కట్టిన గోడల వంటి నిర్మాణం సుమారు 24 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం ఇక్కడ పంటలేవి పండించడం లేదు. దీంతో ఈ బాల్జెనాక్ ద్వీపాన్ని పర్యాటక ప్రాంతంగా క్రొయేషియా ప్రభుత్వం ప్రకచింటింది.

పర్యాటకులు వచ్చి ఆ ద్వీపాన్ని ఎంజాయ్ చేయకుండా..కొంతమంది..ఆ గోడలను నాశనం చేస్తున్నారు. దీంతో ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్న ఈ ద్వీపం తన ప్రత్యేకతను కోల్పేయో ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వేలి ముద్ర ద్విపాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించి..మరింత అభివృద్ధి చేయాలనీ అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news